గూగుల్ క్రోమ్ అంటే తెలియని పీసీ, స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉండరేమో? ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనగానే అందరికీ గూగుల్ క్రోమ్ మాత్రమే గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు గూగుల్ క్రోమ్ యూజర్లకు టెక్ నిపుణలుు బిగ్ అలర్ట్ ఇచ్చారు. అప్ డేట్ల పేరిట యూజర్లను మోసం చేస్తున్నారు.
పర్సనల్ కంప్యూటర్, ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్ వాడే యూజర్లకు గూగుల్ క్రోమ్ బాగా తెలిసి ఉంటుంది. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల్లో గూగుల్ క్రోమ్ ని బ్రౌజింగ్ కోసం వాడుతున్నారు. అయితే టెక్నాలజీ పెరిగిన తర్వాత అదే సమస్యగా మారుతోంది. మీరు ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ చేయడం కూడా మీకు, మీ బ్యాంకు ఖాతాకు పెద్ద చేటు చేయచ్చు. మీరు బ్రౌజ్ చేసే సమయంలో మీ పీసీ, స్మార్ట్ ఫోన్లు హ్యాక్ అవకాశం కూడా లేకపోలేదు. అందుకే బ్రౌజర్లు, యాప్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు గూగుల్ క్రోమ్ విషయంలో ఆ అప్ డేట్ అంశాన్నే మాల్ వేర్ కోసం ఎరగా వేస్తున్నారు.
సెక్యూరిటీ కోసం ఇచ్చే అప్ డేట్లనే మాల్ వేర్ కోసం వాడేసుకుంటున్నారు. ఈ మధ్య వెలుగు చూసిన నయా మోసం విషయంలో టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఏదైనా నకిలీ వెబ్ సైట్ ఓపెన్ చేసినా, ఏదైనా హానికర లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీ ఫోన్ లోకి ఈ మాల్ వేర్ తేలిగ్గా చొరబడుతుంది. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ యూజర్లు లక్ష్యంగానే ఈ లింక్స్ ని ఫార్వాడ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మీరు ఈ డమ్మీ లింక్స్, నకిలీ వెబ్ సైట్లు పై క్రిక్ చేస్తే మీ ఫోన్లోకి ఒక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దాని ద్వారా మీ ఫోన్లోకి మాల్ వేర్ ప్రవేశిస్తుంది. దాని ద్వారా హ్యాకర్లు మీ మొత్తం సమాచారాన్ని సేకరిస్తారు. ఆ మాల్ వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ ఫోన్ లాగిన్స్, మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఇలా అన్నీ వారికి చేరిపోతాయి.
మీరు బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో పాపప్ మెసేజ్ వస్తుంది. మీ బ్రౌజర్ డేంజర్ లో ఉంది. అప్ డేట్ చేసుకోండి అని చెబుతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ పీసీలో మాల్ వేర్ ప్రవేశిస్తుంది. మీరు తెలుసుకోవాల్సింది. ఏదైనా అప్ డేట్ ఉంటే గూగుల్ క్రోమ్ బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా అప్ డేట్ చేస్తుంది. మీరు మాన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. ఓల్డ్ వర్షన్ ఓఎస్, ఓల్డ్ ప్రాసెసర్ అయితేనే మీరు మాన్యువల్ గా అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. నకిలీ వెబ్ సైట్లను కనుగొనేందుకు.. ఆ వెబ్ సైట్ యూఆర్ఎల్ లో పాడ్ లాక్ సింబల్ ఉందా? లేదా? చూసుకోవాలి. అది ఉంటే టీఎస్ఎల్/ఎస్ఎస్ఎల్ సర్టిఫైడ్ అని అర్థం. అందులో మీ డేటా భద్రతంగా ఉంటుంది. యూఆర్ఎల్ లో ఆశ్చర్యార్థకం ఉంటే అది నకిలీ అని అర్థం. ఏదైనా లింక్, వెబ్ సైట్ క్లిక్ చేసే ముందే ఆలోచించుకోండి. చిన్న పొరపాటుతో మీ డేటా చోరీ కావచ్చు.