సామాన్యులకి స్కూటీ కొనడం అనేది ఒక కళ. ఆ కళను మీ కళతో సాకారం ఇప్పుడే సాకారం చేసుకునే అద్భుతమైన అవకాశం మీ ముందే ఉంది. తాజాగా..మీమ్స్ చేసే వారికి ఒక శుభవార్త చెప్పేసాడు భవిష్ అగర్వాల్.
ప్రస్తుత జెనరేషన్ సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా.. ఏ రంగం వారైనా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా సరిగ్గా వాడుకుంటే చాలు.. డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. ఈ క్రమంలో మీమ్స్ ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయి. ఎంత పెద్ద విషయమైనా ఒక ముక్కలో తేల్చేసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం ఇలా చేసేవారికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ మాట భవిష్ అగర్వాల్ చెబుతున్నాడు. అంతే కాదు మీమ్స్ చేసేవారికి బంపర్ అవకాశం కూడా ఇచ్చారు.
సాధారణంగా అందరూ మీమ్స్ చేసి ఫేమస్ అవ్వాలని కోరుకుంటారు. వాటి కోసం ఎంతో కష్టపడతారు. ఇంత చేసినా ఫేమ్ వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. అయినా కానీ కొంతమంది తమ టాలెంట్ నిరూపించుకోవబడానికి ఆరాటపడుతుంటారు. అయితే ఇలాంటివారి కోసం వెతుకుంటూ మరీ ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చిందనే చెప్పుకోవాలి. తాజాగా..మీమ్స్ చేసే వారికి ఒక శుభవార్త చెప్పేసాడు భవిష్ అగర్వాల్. ఇతను ఓలా ఎలెక్రిక్ ముఖ్య కార్య నిర్వహణాధికారి.అయన మాట్లాడుతూ ” ICE అండ్ పెట్రో వెహికల్స్” మీద మీమ్స్ చేయండి. వాటిలో ఎవరైతే బెస్ట్ గా చేస్తారో వారికి ఓలా ఎస్ 1 ప్రో స్పెషల్ ఎడిషన్ లభిస్తుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. దీంతో ఇప్పటికే చాలా మంది వీటి మీద మీమ్స్ పోస్ట్ చేసి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
సామాన్యులకి స్కూటీ కొనడం అనేది ఒక కళ. ఆ కళను మీ కళతో సాకారం ఇప్పుడే సాకారం చేసుకోండి. ఓలా ఎస్ 1 ప్రో స్కూటీ కావాలనుకునే వారు ” ICE అండ్ పెట్రో వెహికల్స్” మీద మీమ్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కూటీ విలువ దాదాపు లక్ష రూపాయలు పైనే కావడం గమనార్హం. మీమ్స్ చేసేవారికి ఒకరకంగా ఇది సువర్ణావకాశం అనే చెప్పుకోవాలి. అయితే ఈ ఆఫర్ ఈ రోజు వరకే అని తెలుస్తుంది. ఇంకెందుకు మీలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకొని లక్ష రూపాయలకు పైగా ఉన్నా ఈ స్కూటర్ గెలుచుకోండి. మొత్తానికి భవిష్ అగర్వాల్ అగర్వాల్ ఇచ్చిన ఆఫర్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Trying to make some funny ICE and petrol vehicle memes. If you have some, share here!
Best one today will get an Ola S1 Pro special edition 🙂
— Bhavish Aggarwal (@bhash) May 27, 2023