దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్ లకు క్రేజ్ అధికమవుతోంది. ప్రముఖ బైక్ కంపెనీలన్నీ.. కొత్త ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ధర కాస్త ఎక్కువగానే ఉంటోంది. ఈ తరుణంలో సంతోషం కలిగించే వార్త మనముందుకొచ్చింది. దేశానికి చెందిన ఓ వ్యక్తి ఓ అద్భుతమైన డివైజ్‌ను తయారు చేశారు. పాత లేదా కొత్త సైకిల్‌కు ఈ డివైజ్ అమర్చితే అది ఎలక్ట్రిక్ బైక్ అవుతుంది. కేవలం గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుండటం మరో విశేషం. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.
దేశానికి గుర్‌సౌరభ్ సింగ్ అనే వ్యక్తి తయారు చేసిన ఎలక్ట్రికల్ కన్వర్షన్ కిట్ పట్ల బిజినెస్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఆసక్తి కనబరిచారు. ‘ఇందులో ఎంతో సామర్థ్యం ఉందని ప్రశంసించారు. సైకిల్‌ను మోటరైజ్ చేసే డివైజ్ ప్రపంచంలో ఇదే మొదటిది కాకపోవచ్చు. అయితే ఇది.. అద్భుతమైన డిజైన్. ఎంతో సురక్షితమైనది. సాధారణ రోడ్లపైనే కాదు.. మట్టిరోడ్లపైన కూడా పని చేయగలదు’ అంటూ ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను పోస్ట్ చేశారు.
But what I appreciate most is his empathy and passion for those hard working people for whom the humble cycle is still the primary mode of transport. It’s a good reminder for all automakers focussing on disruptive EVs that THIS EV revolution may be the most important one. (2/3) pic.twitter.com/ZyiqO2Crkv
— anand mahindra (@anandmahindra) February 12, 2022
డివైజ్ ఎలా పని చేస్తుందంటే..
ఈ డివైజ్ ని ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియమ్‌తో తాయారు చేశారని, తప్పు పట్టదని వీడియోలో తెలిపారు. ఇక 20 నిమిషాల్లోనే ఇది 50 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుంది. గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అలాగే ఈ డివైజ్ ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్‌గా ఉంటుందని వీడియోలో గుర్‌సౌరభ్ సింగ్ వివరించారు. మరో విషయం.. ఈ డివైజ్‌ను సైకిల్‌కు అమర్చేందుకు ఎలాంటి వెల్డింగ్, కటింగ్ అవసరం ఉండదట.
సైకిల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చే ఈ పరికరంపై పెట్టుబడి పెట్టేందుకు ఆనంద్ మహీంద్రా ఆసక్తి కనబరిచారు. వ్యాపారపరంగా విజయవంతం అవుతుందా, లాభాలను తెచ్చిపెడుతుందా అన్నది ముఖ్యం కాదని, ఓ ఇన్వెస్టర్‌గా ఇందులో పెట్టుబడి పెట్టడం గర్వంగా ఫీల్ అవుతానని చెప్పారుఈ విషయంపై డివైజ్‌ను తయారు చేసిన గుర్‌సౌరభ్ సింగ్‌తో ఆనంద్ మహీంద్రా సంప్రదించినట్లు తెలుస్తోంది.
It’s not inevitable that this will succeed commercially or be substantially profitable, but I still would feel proud to be an investor…Grateful if someone can connect me with Gursaurabh, (3/3) pic.twitter.com/GsuzgJECTo
— anand mahindra (@anandmahindra) February 12, 2022