ఓ యువకుడు కేవలం రూ.20 వేల ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. దానిని పది పైసల ఖర్చుతోనే కిలోమీటర్ ప్రయాణించేలా తయారు చేశాడు. అంతే కాకుండా 100 కేజీల బరువును కూడా ఆ సైకిల్ మోసుకెళ్తుందని అతడు చెబుతున్నాడు.
ప్రతి మనిషిలోను ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోని ఘటనలతో ఆ ప్రతిభ బయట పడుతుంది. ఎదుటి వారు గుర్తించడం, ఆసక్తిగా ఎక్కువగా చూపించడం, కష్టాలు చుట్టు ముట్టడం వంటి వాటితో మనిషిలోని ప్రతిభ బయటకు వస్తుంది. అలానే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు కూడా చిన్నప్పటి నుంచి యంత్రాలపై ఆసక్తి చూపించే వాడు. ఆ ఆసక్తితోనే బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. కేవలం పది పైసలకే కి.మీ దూరం ప్రయాణించేలా ఈ-సైకిల్ ను రూపొందించాడు. మరి.. అతడు ఆవిష్కరించిన ఈ-సైకిల్ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్ పుర్ జిల్లాకు చెందిన ఆదిత్య శివ్ హరే(20)కి చిన్నతనం నుంచి యంత్రాలపై ఆసక్తి కలిగి ఉండేవాడు. అలానే కాల క్రమంలే కొత్త కొత్త ఆవిష్కరణల కోసం అనేక ప్రయోగాలు చేస్తుండే వాడు. అలా ఎప్పుడూ ఏదో తయారు చేస్తూ వివిధ స్థాయిల్లో ఎన్నో అవార్డులను అందుకున్నాడు. తాజాగా బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. దీని కోసం రెండు నెలల పాటు కష్టపడి ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారుచేశాడు.
ఇక ఆదిత్య తయారు చేసిన ఈ-సైకిల్ కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సైకిల్ కి 100 కేజీల బరువును మోసే సామర్థ్యం ఉందని ఆదిత్య అంటున్నాడు. ఒకసారి ఈ-సైకిల్‌కు ఛార్జీంగ్ చేస్తే 30 కి.మీ దూరం ప్రయాణించవచ్చని తెలిపాడు. అంటే దీని వల్ల ఒక కి.మీ దూరానికి కేవలం 10 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందంట. ఈ సైకిల్‌కు బైక్‌కు యాక్సెలరేటర్, బ్రేక్, లైట్, హారన్, మొబైల్ స్టాండ్‌ను ఆదిత్య ఏర్పాటు చేశాడు. ఇంధన ధరలు బాగా పెరిగడం, ఎలక్ట్రిక్ బైక్ ల ధరలు లక్ష దాటి ఉండటంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
పేదవారిని దృష్టిలో పెట్టుకుని ఈ సైకిల్ ను తయారు చేసినట్లు ఆదిత్య తెలిపాడు. తాను ఆవిష్కరించిన ఈ-సైకిల్ మార్కెట్లో విడుదలైతే విప్లవం సృష్టిస్తుందని ఆదిత్య అన్నారు. 16 ఏళ్ల వయసులోనే వైర్లు లేకుండా విద్యుత్‌ను తయారు చేశానని, ఈ ప్రయోగం కేవలం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచే కాకుండా ప్రధానమంత్రి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాని ఆదిత్య అన గుర్తుచేశాడు. బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ తనకు స్ఫూర్తి అని ఆదిత్య చెబుతున్నాడు. మరి.. ఈ నూతన ఆవిష్కరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.