టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ సెంచరీ మార్క్ దాటేశాడు. కానీ.. బ్యాటింగ్ చేస్తూ కాదులేండీ.. బౌలింగ్‌లో వందకు పైగా పరుగులు సమర్పించుకున్నాడు. చాలా కాలం తర్వాత రంజీ బరిలోకి దిగిన ఈ స్టార్ లెగ్‌స్పిన్నర్‌ను రంజీ ప్లేయర్లు ఉతికి ఆరేస్తున్నారు. హర్యానా తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న చాహల్.. బరోడాతో మంగళవారం ప్రారంభమైన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి హర్యానా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బరోడా బ్యాటర్లు హర్యానా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో బరోడా ఏకంగా 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. బరోడా ఓపెనర్లు జ్యోత్స్‌నిల్ సింగ్ 195, ప్రత్యూష్ కుమార్ 110 పరుగులతో చెలరేగి ఆడారు. వీరికి తోడుగా కెప్టెన్ విష్ణు సోలంకి 64, ప్రియాన్షు మోలియా 144 పరుగులు చేసి అదరగొట్టడంతో బరోడా భారీ స్కోర్ చేసింది.
కాగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌ను సైతం బరోడా బ్యాటర్లు ఏ మాత్రం లెక్కచేయలేదు. చాహల్ బౌలింగ్‌ను ఉతికి ఆరేసిన బరోడా బ్యాటర్లు.. అతన్ని సెంచరీ మార్క్‌ను దాటేలా కొట్టారు. మొత్తం 27 ఓవర్లు వేసిన చాహల్ ఒక్క వికెట్ తీయకుండా 138 పరుగులు సమర్పించుకున్నాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హర్యానా తరఫున బౌలింగ్ వేసిన ఏడుగురు బౌలర్లలో చాహల్‌దే అత్యధిక ఎకానమీ. 5.11 ఎకానమీతో చాహల్ బౌలింగ్ చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఇది భారీ ఎకానమీగా చెప్పవచ్చు. పైగా టీమిండియా తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడి.. ప్రపంచంలోనే టాప్ బౌలర్లలో ఒకడిగా ఉంటూ.. రంజీ ప్లేయర్ల ముందు చాహల్ తేలిపోవడాన్ని క్రికెట్ అభిమానులు నమ్మలేకపోతున్నారు.
చాహల్‌కు కొంతకాలంగా టీమిండియాలో దక్కడంలేదు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 కోసం చాహల్‌ను ఎంపిక చేసినా.. తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత.. బంగ్లాదేశ్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు సైతం చాహల్‌ను ఎంపిక చేయలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమని భావించిన చాహల్.. చాలా కాలం తర్వాత రంజీ బరిలోకి దిగాడు. ఎన్నో ఆశలతో రంజీ ఆడుతున్న చాహల్‌కు మాత్రం తొలి మ్యాచ్‌లోనే ఊహించని ఫలితం ఎదురైంది. ఒక్కటంటే ఒక్క వికెట్ తీయకుండా చాహల్ ఒకటిన్నర రోజులు బౌలింగ్ వేశాడు. పైగా అందరి కంటే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రంజీల్లో విఫలమైనా చాహల్‌కు ఐపీఎల్‌లో మండి డిమాండ్ ఉంటున్న విషయం తెలిసిందే. మరి రంజీలో చాహల్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yuzvendra Chahal has figures of 0-138 in 27 overs in the ongoing Ranji Trophy match against Baroda. pic.twitter.com/AZDRB8TSsT
— 12th Khiladi (@12th_khiladi) December 21, 2022