సాధారణంగా మనం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఫైట్స్ చేస్తేనే నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతాం. మరి అలాంటిది బోయపాటి ఫైట్స్ కంటే 100 రెట్లతో ఎక్కువగా కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే కచ్చితంగా WWE రెజ్లింగ్ చూడాల్సిందే. WWE.. రెజ్లింగ్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తికాదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన క్రీడాల్లో ఇది ఒకటి. అయితే ఈ గేమ్ అంతా ఫేక్ అని.. వారు కేవలం స్క్రిప్ట్ ప్రకారంమే కొట్టుకుంటారన్న వాదన సైతం ఉంది. ఏదిఏమైనప్పటికీ WWE రెజ్లింగ్ కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దీంట్లో ఎంతో మంది సూపర్ స్టార్లు ఉన్నారు. జాన్ సీనా, రోమన్ రెయిన్స్, ర్యాండీ ఆర్టాన్, అండర్ టేకర్, దీ కేన్, ఇండియన్ బాహుబలి ది గ్రేట్ ఖాలీ లాంటి ఎంతో మంది ఉన్నారు. వీరిల్లో మరో సూపర్ స్టార్ రే మిస్టీరియో ఒకడు. తాజాగా రే మిస్టీరియో పై అతడి కొడుకు దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది.
రే మిస్టీరియో.. WWE రెజ్లింగ్ లో టెక్నీకల్ రెజ్లర్ గా పేరుగాంచాడు. పొట్టిగా సాధారణ మనిషిగా కనిపించే మిస్టీరియో ప్రత్యర్థులను తన తెలివైన ఆటతో బోల్తా కొట్టిస్తుంటాడు. రెజ్లింగ్ ప్రపంచంలో ఇతడిని ముద్దుగా 619 అని పిలుచుకుంటారు అభిమానులు. ఇక మిస్టీరియో కొడుకు డొమినిక్ మిస్టీరియో కూడా WWE రెజ్లరే. అయితే మిస్టీరియో కొడుకు థ్యాంక్స్ గివింగ్ డే లో భాగంగా తండ్రి ఇంటికి వచ్చాడు డొమినిక్. తన వెంట RAW-ట్యాగ్ టీమ్ ఛాంపియన్.. కో స్టార్ రిప్లేను తీసుకొచ్చాడు. తలుపు కొట్టడంతో తల్లి యాంజీ తలుపు తీసింది. వారిద్దరిని చూసిన యాంజీ.. మీ నాన్న ఇక్కడే ఉన్నాడు మీరు ఇక్కడి నుంచి వెళ్లండి అంటూ.. చెప్పి తలుపు వేసింది. మరో సారి డొమినిక్ తలుపు కొట్టగా.. ఈ సారి తండ్రి రే మిస్టీరియో తీశాడు.
ఈ క్రమంలో డొమినిక్ ను చూసిన అతడు కోపంతో ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. అనవసరంగా మీరు గొడవ చేయకండి అంటూ డోర్ మూయబోయాడు మిస్టీరియో.. అంతలోనే తలుపును నెట్టింది రిప్లే. దాంతో మిస్టీరియో కిందపడిపోయాడు. ఆ తర్వాత కిందపడ్డ మిస్టీరియోను విచక్షణారహితంగా కొట్టాడు. తిడుతూ.. బ్రూమ్ స్టిక్ తో గాయం అయిన కాలుపై పదే పదే కొట్టి గాయ పరిచాడు. అనంతరం నవ్వుతూ డొమినిక్-రిప్లేలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే కన్న కొడుకే ఎందుకు ఇలా తండ్రిపై దాడిచేశాడు అని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫైట్ మెుత్తం జడ్జిమెంట్ డే కోసం ప్లాన్ చేసినట్లుగా WWE అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. మరి జడ్జిమెంట్ డే న కొడుకుపై తండ్రి రివేంజ్ తీర్చుకుంటాడా లేదా? అని కామెంట్స్ చేయండి అంటూ రాసుకొచ్చింది యాజమాన్యం.
OH NO! 😲😲😲@RheaRipley_WWE & @DomMysterio35 crashed Thanksgiving at the Mysterio household and brutally attacked @reymysterio! pic.twitter.com/Rwrb39QPGh
— WWE (@WWE) November 24, 2022