క్రికెట్‌లో ఫీల్డర్ లేదా బౌలర్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ఏం చేయాలి? అతన్ని అవుట్‌గా ప్రకటిస్తారా? లేదా? మ్యాథ్యూ వేడ్-మార్క్ వుడ్ మధ్య జరిగిన వివాదాస్పద సంఘటనతో క్రికెట్ అభిమానులను ఈ ప్రశ్న తొలిచేస్తోంది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆసీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ 17వ వేసిన బంతికి వేడ్ కొట్టిన షాట్ గాల్లోకి లేచింది. బంతి ఎటువైపు పోయిందో అంచనా వేయలేకపోయిన వేడ్ పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ.. మార్క్ వుడ్ తనవైపు క్యాచ్ కోసం పరిగెత్తుకు రావడం గమనించి.. బంతికి గాల్లో తనపైనే లేచిందని గ్రహించి.. తిరిగి క్రీజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో క్యాచ్ కోసం వస్తున్న మార్క్‌వుడ్‌ను తన చేతితో అడ్డుకున్నాడు.
వేడ్ అడ్డుకోవడంతో మార్క్‌వుడ్ క్యాచ్ అందుకోవడలంలో విఫలం అవుతాడు. ఈ ఘటనతో మార్క్‌వుడ్‌తో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లంతా షాక్ అవుతారు. ఏంటి వేడ్ అలా చేశాడంటూ అంపైర్ల వైపు చూస్తూ ఉండిపోయారా కానీ.. అప్పీల్ చేయలేదు. అంపైర్లే జోక్యం చేసుకుని.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను అప్పీల్ విషయమై సంప్రదించగా తామా అప్పీల్ చేయదల్చుకోలేదని అన్నాడు. దీంతో అంపైర్లు వేడ్‌ను అవుట్‌గా ప్రకటించలేదు. నిజానికి క్రికెట్ లా ప్రకారం.. డెలవరీ నోబాల్ కాకుండా ఉండి, క్యాచ్ పట్టే ఫీల్డర్‌ను బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే అతన్ని అవుట్‌గా ప్రకటించాలని ఎంసీసీ చట్టం 37.3 నిబంధన చెబుతుంది.
ఈ ఘటనలో వేడ్.. మార్క్‌వుడ్‌ను అడ్డుకుంటున్నట్లు స్పష్టం తెలిసినా.. ఇంగ్లండ్ అప్పీల్ చేయకపోవడంతో అంపైర్లు వేడ్‌ను అవుట్‌గా ప్రకటించలేదు. వాళ్లు అప్పీల్ చేసి ఉంటే మ్యాథ్యూ వేడ్‌ను అంపైర్లు కచ్చితంగా అవుట్ ఇచ్చేవారు. కాగా.. అప్పీల్ చేయకపోవడంపై ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ స్పందిస్తూ.. ‘అప్పీల్ చేసి సిరీస్ తొలి మ్యాచ్‌తోనే మేము వివాదాల్లోకి వెళ్లదల్చుకోలేదు. అందుకే అప్పీల్ చేయలేదు. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అనేది నాకు తెలియదు. అందులో ఎంత నిజముందో ఆసీస్ ఆటగాళ్లకే తెలియాలి. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. పైగా మేము ఇంకా చాలా రోజులు ఆస్ట్రేలియాలో ఉండాలి. తొలి మ్యాచ్‌తోనే వివాదాల్లోకి వెళ్లితే మా జట్టు డిస్టబ్ అవుతుంది’ అని బట్లర్ తెలిపాడు.
Mathew Wade is doing what other side always do.🤣🤣🤣pic.twitter.com/B8DZoE8lm9
— Cric (@CricLavdeep4518) October 9, 2022