క్రికెట్ లో విషాదం. మాజీ స్టార్ వికెట్ కీపర్ తుదిశ్వాస విడిచాడు. తన ఇంటి బయట కుప్పకూలిన ఆయన… ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచాడు. దీంతో ఆయన అభిమానులు చాలా బాధపడుతున్నారు. పలువురు ఇతర ఆటగాళ్లు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఆయన చనిపోవడానికి.. చెడు వ్యసనాలే కారణమని తెలుస్తోంది. గతంలో ఆయన విషయంలో జరిగిన సంఘటనల్ని ఇప్పుడు నెటిజన్స్ మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. దీంతో ఆయన కెరీర్, మరణం హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వెస్టిండీస్ మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ డేవిడ్ ముర్రే(72) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బ్రిడ్జ్ టౌన్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అయితే అకస్మాత్తుగా కుప్పకూలిన ఆయన్ని.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఇలా జరిగింది. ఇకపోతే కరీబియన్ క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన వికెట్ కీపర్స్ లో ముర్రే ఒకరు. అయితే మత్తు పదార్థాలకు ఆయన బానిస కావడంతో ముర్రే కెరీర్ కి తెరపడింది. 1975-76 ఆస్ట్రేలియా పర్యటనలో రూల్స్ బ్రేక్ చేసినందుకు ముర్రే క్రమశిక్షణ చర్యలు ఫేస్ చేశారు. దీంతో ఆ సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశారు.
ఇక ఆ తర్వాత జాతీయ జట్టులో అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ చోటు దక్కలేదు. వెస్టిండీస్ తరఫున 19 టెస్టులు ఆడిన ముర్రే.. 601 పరుగులు చేశారు. ఫస్ట్ క్లాస్ లోనూ ఆయన డబుల్ సెంచరీ చేశారు. క్రికెట్ అనేది ముర్రే బ్లడ్ లోనే ఉంది. ఎందుకంటే ఇతడి తండ్రి ఎవర్టన్ వీక్స్ కూడా.. వెస్టిండీస్ జట్టులో బ్యాటర్ గా ఆడారు. ఇక ముర్రే కొడుకు రికీ హోయ్ టే కూడా 90ల్లో బార్బడోస్ జట్టు తరఫున వికెట్ కీపర్-బ్యాటర్ గా ఆడాడు. ఇదిలాఉండగా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే సిగరెట్, డ్రగ్స్, కొకైన్ లాంటి వాటికి అలవాటు పడ్డ ముర్రే.. చివరి వరకు ఆ వ్యసనానికి బానిసైపోయాడు. చివరి రోజుల్లో సరైన ఆదాయం లేక.. నిరుపేద జీవితం బతికాడు. ఇప్పుడు తుదిశ్వాస విడిచాడు.