భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌కు ముందు కరోనా కలవరం రేగింది. శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ కరోనా బారిన పడి సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన అతడు ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. భారత్‌తో సిరీస్ నేపథ్యంలో నిర్వహించిన ఆర్‌టీ- పీసీఆర్ పరీక్షలో హసరంగకు మరోసారి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. టెస్టు సిరీస్‌కు కూడా హసరంగ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సమయంలో హసరంగకు కరోనా సోకింది. అతడితో పాటు కుశాల్ మెండిస్, బినుర ఫెర్నాండో కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో వీరు ముగ్గురు పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. దీంతో సిరీస్‌కు కరోనా గండంగా మారింది. మరికొందరు క్రికెటర్లకు కరోనా సోకితే ఏంటి పరిస్థితి అని క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గురువారం భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.