వివాదాల గురువు.. రావల్పిండి ఎక్సప్రెస్ షోయభ్ అక్తర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఇప్పటివరకు గాయ పరుద్దామనుకున్నా, తల పగలగొట్టాలనుకున్నా..’ వరకే మాట్లాడిన అక్తర్, ఇప్పుడు ఏకంగా సెహ్వాగ్ చంపేసేవాడినంటూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు. గతంలో అతడిపై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై.. ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు.
దాయాదుల మ్యాచ్‌కున్న కిక్కే వేరు. బరిలో భారత్, పాక్ తలపడితే అది లీగా.. నాకౌటా.. అనే తేడా ఉండదు! ఎక్కడ ఆడినా.. ఎప్పుడు ఎదురుపడినా అది ‘ఫైనల్’ను మించిన సమరమే! అలాంటి మ్యాచ్ ఆదివారం ఆసియా కప్ టి20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య ఉత్కంఠగా జరిగింది. చివరకు భారత జట్టు 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ విజయంపై మాట్లాడానికి వచ్చిన అక్తర్ ను.. ఓ భారత జర్నలిస్టు పాత విషయాలు అడిగి మరీ రెచ్చగొట్టారు.
“ఒకరోజు ఇండియా- పాక్ మ్యాచ్ జరుగుతుండగా, సెహ్వాగ్.. తనకు అక్తర్ బౌన్సర్ వేసినప్పుడు.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న సచిన్ ను చూపించి, నీ ప్రతాపం నా దగ్గర కాదు.. అక్కడ చూపించు అని చెప్పాడట. అదే మ్యాచులో సచిన్ బ్యాటింగ్ చేస్తూ అక్తర్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టాక అతడితో.. ‘బాప్ బాప్ హోతా హై’ అని సెహ్వాగ్ అన్నాడట”. తాజాగా అక్తర్ తో ముఖాముఖిలో సదరు జర్నలిస్టు ఈ ప్రశ్నను లేవనెత్తారు. ఇంకా అలాంటి ఘటనలేమైనా జరిగాయా? ఏవైనా ఉంటే చెబుతారా..? అని జర్నలిస్టు ప్రశ్నించింది.
Shoaib Akhtar is on fire 🔥🔥🔥 pic.twitter.com/A1XtrmveZN
— Taimoor Zaman (@taimoorze) August 27, 2022
దీంతో చిర్రెత్తుకొచ్చిన అక్తర్.. జర్నలిస్టుపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇక్కడ మీకు రెండు విషయాలపై క్లారిటీ ఇవ్వదలుచుకున్నా.. ఒకటి, సెహ్వాగ్.. నిజంగానే ఆ కామెంట్ నా ముందు చేసుంటే అతడు ఇవాళ బతికుండేవాడు కాదు. ఈ కామెంట్ ఎప్పుడు, ఎందుకు చేశాడో నాకైతే తెలియదు. ఇక, రెండోది.. ఈ పనికిమాలిన ప్రశ్నల వల్ల మనకు వచ్చేదేమీ ఉండదు.. కనుక, మనం క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా అంటే నాకు చాలా గౌరవముంది. ఇలాంటి కామెంట్స్ వల్ల రెండు దేశాల మధ్య ఉన్న ప్రశాంతతను నేను చెడగొట్టదలుచుకోలేదు..’ అని ఘాటుగా బదులిచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.