టీ20 వరల్డ్ కప్ 2021లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. నమీబియాతో చివరి మ్యాచ్ ఆడి ఇండియన్ టీం ఇంటికి బయలుదేరింది. ముందుగా ప్రకటించినట్టే ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా పొట్టి క్రికెట్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. కెప్టెన్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ అందుకోసం కోహ్లీ కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా తన ప్రదర్శన కంటే భవిష్యత్తులో టీమిండియాకు మెరికల్లాంటి ఆటగాళ్లను ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో తన ఫిక్స్‌డ్ స్పాట్ వన్‌డౌన్‌ను కూడా త్యాగం చేశాడు. జట్టు అవసరాల కోసం కొన్ని సార్లు, యువ ఆటగాళ్లకు అవకాశలు ఇచ్చి వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కొన్ని సార్లు తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకున్నాడు.
టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గా పేరుతెచ్చుకున్న సురేష్ రైనా కోసం ఏకంగా 7 సార్లు తన వన్‌డౌన్ స్థానాన్ని త్యాగం చేశాడు. ఇక కేఎల్ రాహుల్ కోసం 4 సార్లు, రిషభ్ పంత్ కోసం 3, సూర్యకుమార్ యాదవ్ కోసం 3, శివం దూబే కోసం 2, శ్రేయస్ అయ్యర్ కోసం2, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కోసం ఒక్కొసారి తన వన్‌డౌన్ స్థానాన్ని త్యాగం చేశాడు. ఆ స్థానంలో కోహ్లీ చేసిన పరుగుల అన్ని ఇన్ని కావు. అలాంటిది కెప్టెన్‌గా తనకంటే కూడా జట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గొప్ప కెప్టెన్‌గా నిలిచిపోయాడు. మైదానంలో ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటూ జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేవాడు. జట్టు కష్టాల్లో ఉంటే ఒంటి చేత్తో ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటూనే ఒక అద్భుతమైన జట్టును వచ్చే కెప్టెన్‌కు కానుకగా ఇచ్చాడు.
ఇదీ చదవండి: టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే ఆఖరి మ్యాచ్.. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన రికార్డ్స్ ఇవే!