క్రికెట్ అనగానే.. మనలో చాలామందికి గుర్తొచ్చే పేర్లు దిగ్గజ సచిన్, విరాట్ కోహ్లీ. మిగతా ఆటగాళ్లు కూడా ఉన్నారు. బట్ ఎక్కవమందికి మాత్రం సచిన్, కోహ్లీ మాత్రమే గుర్తొస్తారు. టీమిండియా తరఫున వీళ్లిద్దరూ కూడా బ్యాటింగ్ లో లెక్కలేనన్ని రికార్డులు సృష్టించారు. ఇక సచిన్ ఎప్పుడో 2013లోనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. కోహ్లీ మాత్రం ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్నాడు. ఇక ఆట పరంగా కోహ్లీ, సచిన్ పోల్చి చూడలేం ఎందుకంటే ఇద్దరూ కూడా ఎవరికీ వారే సాటి.
ఇక వివరాల్లోకి వెళ్తే… టీనేజ్ లోనే టీమిండియాలోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాడు. అన్ని ఫార్మాట్లలోకి కలిపి 100కి పైగా సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ కెరీర్ లో 34,357 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లోనూ 2334 పరుగులు చేసి అలరించాడు. ఇక కోహ్లీ కూడా టీనేజ్ లోనే జట్టులోకి వచ్చేశాడు. ప్రస్తుతం 71 సెంచరీలతో సచిన్ నెలకొల్పిన సెంచరీల రికార్డుని బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తున్నాడు. ఇక తాజాగా క్రికెబజ్ వెబ్ సైట్ తో మాట్లాడిన సచిన్ తనయుడు అర్జున్ తెందుల్కర్… షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘కళాత్మక షాట్స్ ఆడే విషయంలో మా నాన్న(సచిన్) కంటే కోహ్లీనే అత్యుత్తమం’ అని అర్జున్ చెప్పినట్లు చీకూ అనే యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సచిన్, కోహ్లీ.. ఇద్దరూ కూడా కవర్ డ్రైవ్స్ బ్యూటీఫుల్ గా కొడతారు. ప్రత్యేకించి ఆ షాట్లకే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతెందుకు ఈ ఆర్టికల్ చదువుతున్న మీలో కూడా సచిన్ లేదంటే కోహ్లీ కవర్ డ్రైవ్ షాట్ కి ఫిదా అయ్యే ఉంటారు. సరే ఇదంతా పక్కనబెడితే అర్జున్ టెండూల్కర్ షాకింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Aesthetically VIRAT KOHLI is a better batsman than my dad – Arjun Tendulkar on cricbuzz
— Cheeku. (@primeKohli) October 18, 2022