రన్ మెషిన్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఇప్పటికే పలు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వాటికి మరో రికార్డును జోడించాడు కింగ్ కోహ్లీ. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై 5 వేల పరుగుల మైలు రాయి అందుకున్నాడు. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేల్లో 8 పరుగులే చేసిన కోహ్లీ 5 వేల పరుగుల మార్క్‌ను దాటాడు.
Here are the players who have scored the most runs in successful chases in ODIs 🏏
Sachin Tendulkar, Virat Kohli and Rohit Sharma feature in the top 6 💪#India #TeamIndia pic.twitter.com/P32iJuYLkJ
— Sportskeeda (@Sportskeeda) February 5, 2022
ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 48.11 సగటుతో 6,976 పరగులు చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 5521 పరుగులు- 39.71 సగటు, కల్లీస్ (దక్షిణాఫ్రికా) 5186 పరుగులు- 45.89 సగటు ఉన్నారు. కానీ సగటులో మాత్రం విరాట్ కోహ్లీ (60.17) సగటుతో అగ్రస్థానంలో ఉన్నాడు. సొంతగడ్డపై అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. సొంతగడ్డపై విరాట్ కోహ్లీ 99 మ్యాచ్‌ల్లో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలు, 25 అర్థశతకాలు ఉన్నాయి. మరి కోహ్లీ సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.