క్రికెట్ అనేది మనదేశంలో ఆట కాదు. ఓ ఎమోషన్. ఇక క్రికెటర్లని అయితే తెగ ప్రేమిస్తారు. వాళ్లు సిక్సు కొడితే పండగ చేసుకుంటారు. సెంచరీ చేస్తే సంబరపడిపోతారు. కపిల్ దేవ్ మొదలుకుని విరాట్ కోహ్లీ వరకు ఎంతోమంది అద్భుతమైన క్రికెటర్లు మన జట్టులో ఉన్నారు. ఇక వాళ్ల గురించి ఏమైనా ఆసక్తికర విషయం బయటకొచ్చినా.. ఫ్యాన్స్ వెంటనే అలెర్ట్ అయిపోతారు. దాని గురించి తెగ మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. కాకపోతే ఇందులోనే చిన్న ట్విస్ట్ ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్-పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుత జట్ల గురించి ప్రస్తావన రాగానే మనకు కోహ్లీ, వాళ్ల జట్టులో బాబర్ ఆజామ్ గుర్తొస్తారు. ఎవరికే వారు అన్నట్లు బ్యాటర్, కెప్టెన్ గా పలు రికార్డులు సృష్టించారు. ఇంకా వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఏ విషయంలో వీరిద్దరికీ పోలిక లేదు. ఎవరికీ వారే సాటి అన్నట్లు ఆడుతుంటారు. అలాంటిది వీరిద్దరూ ఓ విషయంలో ఒకేలా ఉన్నారని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. అందుకు కారణంగా వీళ్లిద్దరి చిన్నప్పటి ఫొటోలు వైరల్ కావడం. ఇక అందులో వీరిద్దరూ కూడా ఒకేలాంటి షర్ట్స్ ధరించడమే కాదు దాదాపు ఒకేలాంటి హెయిర్ స్టైల్ తోనూ దర్శనమిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని.. కోహ్లీ-బాబర్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
How come, both babar & kohli are wearing the same shirts 😭
That bowl cut 🥰 pic.twitter.com/85PYXR6tyA
— Masab Aqeel Janjua (@MasabAqeelreal) September 27, 2022
ఇక కోహ్లీ కెరీర్ విషయానికొస్తే.. బాబర్ కంటే ఎన్నో ఏళ్ల ముందు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. సచిన్ తర్వాత వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్ లో పలు సరికొత్త రికార్డులను సృష్టించాడు. ఇక కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టిన బాబర్.. కోహ్లీ కంటే వేగంగా రికార్డులు సృష్టించాడు. ఇంకా చెప్పాలంటే విరాట్ నెలకొల్పిన కొన్ని రికార్డులని బ్రేక్ చేశాడు. కోహ్లీ సాధించిన ఘనతని బద్దలు కొట్టేందుకు దాదాపు చేరువలో ఉన్నాడు. ఇదిలా ఉండగా టీ20ల్లో 3000 పరుగులు వేగంగా చేసిన బ్యాటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతేడాది ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఈ మార్క్ అందుకున్నాడు. దీనిని 81 ఇన్నింగ్సుల్లో సాధించాడు. ఇక 27 ఏళ్ల బాబర్.. ప్రస్తుతం 79 టీ20 ఇన్నింగ్సుల్లో 2,939 పరుగులతో ఉన్నాడు. కోహ్లీ రికార్డు బ్రేక్ చేయాలంటే మరో 61 పరుగులు చేయాలి. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఇదంతా పక్కనబెడితే.. కోహ్లీ-బాబర్ చిన్నప్పటి ఫొటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.