బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. గ్లామరస్ బ్యూటీ అయిన ఈమె.. హిందీతోపాటే తమిళంలోనూ నటించింది. ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే కాదన్నట్లు ఫొటోలు పోస్ట్ చేయడంతో ఎప్పుడు వార్తల్లో ఉండే ఊర్వశి.. క్రికెటర్ పంత్ తోనూ పరోక్షంగా గొడవపడింది. సోషల్ మీడియాలో దీని గురించి ఇప్పటికీ చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ గొడవ గురించి అందరూ మాట్లాడుకునేలా మరో వీడియో పోస్ట్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ అంటే ఇష్టం లేదు,చూడనని నటి ఊర్వశి రౌతేలా చెప్పింది. ఇప్పుడే అదే క్రికెట్ చూడటం కోసం దుబాయి వచ్చింది. కొన్నాళ్ల ముందు క్రికెటర్ ఆర్పీ, తనకోసం గంటలు గంటలు ఎదురుచూశాడని తెలిపింది. సరిగ్గా ఆమె పోస్ట్ పెట్టిన సమయంలోనే యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ కూడా ఇన్ స్టాలో పరోక్షంగా ఆమెని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టాడు. దీంతో అందరికీ విషయం అర్థమైపోయింది. వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందేమోనని అనుకుంటున్నారు.
ప్రస్తుతం ఆసియాకప్ లో టీమిండియాకు పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పాక్ జట్టుతో సూపర్ 4 మ్యాచ్ లో బ్యాటింగ్ లో నిరాశపరిచాడు. మరోవైపు భారత్ ఆడుతున్న అన్ని మ్యాచులకు అటెండ్ అవుతున్న ఊర్వశి… అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా పంత్ పై జెలసీతో ఓ వీడియో పోస్ట్ చేసినట్లు కనిపిస్తుంది. పాక్ యంగ్ బౌలర్ నసీష్ షా-ఊర్వశి విజువల్స్ కలిపి ఓ నెటిజన్ వీడియో క్రియేట్ చేయగా, దాన్ని ఈమె తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమెని ఆడేసుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఫేమ్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఊర్వశిపై పంత్ ఫైర్
Urvashi Rautela posted a video of herself and Naseem Shah on her Instagram story😂😂 pic.twitter.com/yH87gzEvH6
— Fatimah (@zkii25) September 6, 2022