కామన్‌వెల్త్‌లో మొదటిసారిగా జరుగుతున్న మహిళల క్రికెట్‌లో భారత క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. టీమిండియా పైనల్‌కు చేరుకోవడం పట్ల యావత్ దేశం గర్విస్తుంది. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ను 160/6 స్కోరుకే పరిమితం చేసిన భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో స్కివెర్ 41, వ్యాట్ 35, జోన్స్ 31, సోఫీ డంక్లే 19, కాప్సీ 13, సోఫీ 7, బౌచిర్ 4 పరుగులు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. దీంతో రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్‌లో భారత్ తలపడనుంది.
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుని 164 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మందాన, షఫాలీ వర్మ తొలి వికెట్‌కు 76 పరుగులను జోడించారు. మందాన కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించారు. భారత్ స్కోర్ పుంజుకుంటుందనగా వెంటనే ఇద్దరూ పెవిలియన్‌కు చేరడంతో స్కోర్ బోర్డు పడిపోయింది. హర్మన్ 20, దీప్తి శర్మ 22 పరుగులు చేయగా.. జెమీయా రోడ్రిగ్స్ 44 పరుగులతో ఆఖరి వరకూ నాటవుట్‌గా నిలిచి మంచి స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెంప్ 2 వికెట్లు తీయగా.. బ్రంట్, స్కివెర్ చెరో వికెట్ తీశారు.
FINALS, here we come 💥💙💪#TeamIndia #GoForGlory pic.twitter.com/wSYHmlv3rb
— BCCI Women (@BCCIWomen) August 6, 2022