టీ20 ప్రపంచకప్ 2022 పోరులో టీమిండియా తమ వేటను ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్.. తదుపరి మ్యాచులో నెదర్లాండ్స్ ను ఢీకొట్టనుంది. గురువారం సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా, ఆటగాళ్లు ఇప్పటికే సిడ్నీకి చేరుకొని ప్రాక్టీస్ లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి సమయాన భారత జట్టుకు ఘోర అవమానం జరిగినట్టు తెలుస్తోంది. ఆటగాళ్లకు చల్లగా ఉన్న ఆహారం, క్వాలిటీ లేని ఫుడ్ పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై భారత ఆటగాళ్లు మండిపడ్డారు. ఇటువంటి ఫుడ్ ను తినలేమని.. లంచ్ ను బాయ్ కాట్ చేశారు. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
శత్రువు అయినా సరే, ఇంటికి వస్తే కడుపు నిండా భోజనం పెట్టి పంపడం భారతీయుల సంస్కృతి, సంప్రదాయం. ఇతర దేశాల క్రికెటర్లు మన దేశంలో పర్యటించినప్పుడు కూడా ఆతిథ్యం విషయంలో ఎక్కడా రాజీపడింది లేదు. అన్ని రకాల వంటకాలు వారు ముందుండేవి. అలాంటి మనకు చల్లబడిన సాండ్‌విచ్‌లు, పండ్లు, సలాడ్స్ అందించారనే విషయం తెలిసి భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా కలిసి భారత్ పై కుట్ర చేస్తున్నాయంటూ మండిపడుతున్నారు. తాజాగా, ఈ విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఐసీసీ తీరును ఎండగడుతూ ట్వీట్ చేశాడు. “పాశ్చాత్య దేశాలు మంచి ఆతిథ్యం ఇస్తాయని అనుకునే రోజులు పోయాయి. అత్యున్నత ప్రమాణాలతో కూడిన అతిథి సత్కారాలను అందించడంలో భారతదేశం పాశ్చాత్య దేశాల కంటే చాలా ముందుంది..’ అని ట్వీట్ చేశాడు సెహ్వాగ్.
Gone are the days when one used to think that the Western countries offer so good hospitality. India are way ahead of most western countries when it comes to providing hospitality of the highest standards.
— Virender Sehwag (@virendersehwag) October 26, 2022
సాధారణంగా ద్వైపాక్షిక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి బోర్డులు, విదేశీ క్రికెటర్ల ఆహారపు అలవాట్లను బట్టి ఏర్పాట్లు చేస్తుంటాయి. అయితే ఇది ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నీ కనుక అన్ని దేశాల క్రికెటర్లకు ఒకే రకమైన ఏర్పాట్లు చేశారు. కానీ అలా జరగనట్లు తెలుస్తోంది. భారత క్రికెటర్లకు చల్లబడిన అవకాడో, టొమాటో, కీరా దోశలు ఇవ్వడంతో ప్లేయర్లు వాటిని తినలేక ఫ్రూట్స్ తో కడుపు నింపుకున్నారు..’ అంటూ బీసీసీఐ అధికారులు ఓ మీడియా ప్రతినిధికి తెలిపారట. ఈ విషయం తెలిసి భారత అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ‘మీరు మా దేశంలో పర్యటించినపుడు బిర్యానీ పెట్టి ఎంత మంచిగా చూసుకున్నాం.. అలాంటిది మాకు చద్దన్నం పెడతారా..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ టోర్నీ ద్వారా కోట్లు వెనకేసుకుంటున్న ఐసీసీ.. ప్లేయర్లకు సరైన తిండి కూడా పెట్టకపోవడం సిగ్గుచేటు..’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
🚨 BREAKING NEWS 🚨
👉 Indian players are unhappy with the food served at SCG after the practice on Tuesday 🏟
👉 The team was reportedly served cold sandwiches after long practice session 😲
👉 BCCI has now filed a complaint to the ICC about the same 📰#Ireland #IREvENG pic.twitter.com/LTczgUkZnV
— SportsBash (@thesportsbash) October 26, 2022