నిజంగా అదృష్టం అంటే పాకిస్థాన్ జట్టుదే. అసలు కలలో కూడా ఊహించి ఉండదు.. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో అడుగుపెడతానని. కానీ లక్ వల్ల సెమీస్ లోకి వెళ్లిపోయింది. ఇక ఈ టోర్నీలో పాక్ జట్టుకు మంచి రికార్డే ఉంది. ఎక్కువసార్లు సెమీస్ లో అడుగుపెట్టిన టీంగా ఘనత సాధించింది. దీంతో ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లకు అప్పుడే భయం మొదలైనట్లు కనిపిస్తోంది. న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ.. పాక్ జట్టు అస్సలు తక్కువ అంచనా వేయలేమని చెప్పాడు. ఆ జట్టు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇప్పుడు అవి కాస్త వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి టీ20 వరల్డ్ కప్ యమ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, టీమిండియా, పాకిస్థాన్ జట్లు సెమీస్ లో అడుగుపెట్టాయి. పెద్ద పెద్ద జట్లు అనుహ్యంగా సెమీస్ రేసు నుంచి తప్పుకొన్నాయి. సూపర్-12 దశలో టీమిండియా, జింబాబ్వే చేతిలో తొలి రెండు మ్యాచ్ లు ఓడిపోయిన పాక్ జట్టు.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సెమీస్ లోకి ఎంటరైంది. అయితే పాక్ జట్టుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఈ టోర్నీలో దాయాది జట్టుకు మెరుగైన రికార్డు ఉంది. ఫెయిల్ అవుతున్నప్పటికీ.. ఆ జట్టులో టీ20 నం.1 బ్యాటర్, బౌలర్ ఉన్నారు. వాళ్లు సెట్ అయి ఫామ్ లోకి వచ్చేస్తే.. అవతల ఉన్నది ఏ జట్టయినా సరే.. సులభంగా ఓడించేస్తారు. ఇప్పుడు అదే భయం న్యూజిలాండ్ కి పట్టుకున్నట్లు కనిపిస్తోంది. పాక్ జట్టుతో చాలా డేంజర్ అని క్లారిటీ ఇచ్చాడు.
‘మేం పాక్స జట్టుతో ఇప్పటికే చాలా మ్యాచులు ఆడాం. వాళ్లతో చాలా డేంజర్. ఎలాంటి అవకాశం లేకపోయినా సరే ఫలితాన్నితారుమారు చేయగల సత్తా వాళ్లకు ఉంది. ఒకవేళ సెమీస్ లో అలాంటిది ఏమైనా చేస్తే మాత్రం మాకు ఓటమి తప్పదు. అలానే మేం(న్యూజిలాండ్) ఈ స్టేజీకి రావడానికి చాలా క్రికెట్ ఆడాం. పాక్ కూడా మంచి నాణ్యమైన జట్టు. బుధవారం వాళ్లతోనే సెమీస్ లో తలపడబోతున్నాం. ఇప్పటివరకు జరిగినట్లే వాళ్లపై మంచిగా ఆడి సెమీస్ లో గెలుస్తామనుకుంటున్నాం. సూపర్-12, సెమీస్ అనేది మాకు సంబంధం లేదు. మ్యాచ్ ఏదైనా సరే మా అప్రోచ్ ఒకేలా ఉంటుంది.’ అని టిమ్ సౌథీ, సెమీస్ కు ముందు జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ ప్రేమికుల మధ్య చర్చనీయాంశమైంది.
𝐂𝐨𝐧𝐟𝐢𝐫𝐦𝐞𝐝
Pakistan 🆚 New Zealand
Semi-final at the SCG! 🏏#WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/8Xqs6Qwvaf— Pakistan Cricket (@TheRealPCB) November 6, 2022