టీ20 ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదయ్యాయంది. దాయాది పాకిస్తాన్ జట్టు, పసికూన జింబాబ్వే చేతిలో దారుణంగా ఓడింది. జింబాబ్వే నిర్ధేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో పాక్ ఒక్క రన్ తేడాతో ఓటమి పాలయ్యింది. ఈ ఓటమితో పొట్టి ప్రపంచ కప్ లో పాక్ పోరు ముగినట్లే కనపడుతోంది. పాకిస్తాన్ తన తొలి మ్యాచులో భారత్ చేతిలో కూడా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈసారి కప్ మాదే అంటూ విర్రవీగిన పాక్ కు ఈ ఓటమితో స్వదేశానికి టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 31 పరుగులతో టాప్ స్కోరర్ కాగా, చివరిలో బ్రాడ్ ఈవెన్స్ 19, ర్యాన్ బర్ల్ 10 పరుగులు చేయడంతో కనీసం పోరాడే స్కోరైనా చేయగలిగింది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ వసీమ్ 4, షాదాబ్ ఖాన్ 3, హారిస్ రౌఫ్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఒక్క రన్ తేడాతో ఓటమి పాలయ్యింది.
Zimbabwe won in the “Bean rivalry”. pic.twitter.com/Yesa7RoQVz
— Johns. (@CricCrazyJohns) October 27, 2022
ఈ మ్యాచులో ఆఖరివరకు విజయం పాక్ చేతిలోనే ఉన్నా.. చివరి మూడు బంతుల్లో ఫలితం తారుమారయ్యింది. పాక్ బ్యాటరల్లో షాన్ మసూద్(44) మినహా ఏ ఒక్క ఆటగాడు రాణించింది లేదు. జిమ్ బాబర్(4) పరుగులకే పెవిలియన్ చేరితే, నెంబర్ -1 టీ20 బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్(14) అతని వెంటే పెవిలియన్ చేరాడు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా 3 వికెట్లు తీయగా, బ్రాడ్ లెవెన్స్ 2, ముజార్బాని, ల్యూక్ జాంగ్వే తలా వికెట్ తీసుకున్నారు. ఈ ఓటమితో పాక్ పాయింట్స్ టేబుల్లో ఇదో స్థానంలో ఉంది.
WHAT A GAME 🤩
Zimbabwe hold their nerve against Pakistan and clinch a thrilling win by a solitary run!#T20WorldCup | #PAKvZIM | 📝: https://t.co/ufgJMugdrK pic.twitter.com/crpuwpdhv5
— ICC (@ICC) October 27, 2022
What A Match , What A Win , What A World Cup ! 🔥@ZimCricketv ✨🇿🇼#PAKvsZIM | #T20worldcup22 pic.twitter.com/2TuPcLTHyX
— Naresh Chouhan (@iamNchouhan) October 27, 2022