టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో, అది కూడా పాకిస్థాన్ జట్టుపై అద్భుత విజయం సాధించింది. ఇక కప్ కొట్టేయాలనేంత కసిగా ఉంది. తొలి మ్యాచ్ లో భారత్ జట్టు, మరీ ముఖ్యంగా కోహ్లీ ఊపు చూసిన వాళ్లు ఎవరైనా సరే మన జట్టే విజేత అని ఆల్మోస్ట్ ఫిక్సయిపోతున్నారు. ఇలాంటి టైంలో భారత జట్టుపై కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోంది! డైరెక్ట్ గా ఎదుర్కోలేక పరోక్షంగా కావాలనే భారత ఆటగాళ్ల శక్తి దెబ్బతీయాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో భాగంగా భారత్-పాక్ మ్యాచ్.. ఆదివారం జరిగిపోయింది. ఇక నెదర్లాండ్స్ తో తర్వాత మ్యాచ్ కోసం టీమిండియా సిడ్నీలో అడుగుపెట్టింది. మంగళవారం ప్రాక్టీసు సెషన్ లో ఆటగాళ్లు తెగ కష్టపడ్డారు. ఆ తర్వాత లంచ్ లో పెట్టిన ఫుడ్ పై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుడ్ సరిగా లేదని, అది కూడా చల్లారిపోయిందని ఫిర్యాదు చేశారు. ప్రాక్టీసు చేసి వచ్చిన భారత క్రికెటర్లకు కేవలం శాండ్ విచ్ లు, సాధారణ ఆహారం మాత్రమే ఇచ్చారని బీసీసీఐ మండిపడింది. ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలికి(ఐసీసీ) ఫిర్యాదు చేసింది.
‘ద్వైపాక్షిక సిరీస్ లో హోస్ట్ అసోసియేషన్ క్యాటరింగ్ బాధ్యతలు నిర్వహిస్తుంది.. ప్రాక్టీసు సెషన్ తర్వాత ఎప్పుడూ వేడిగా ఉండే ఫుడ్ సర్వ్ చేస్తుంది. ఐసీసీ టోర్నీల్లోనూ ఇలానే చేయాలి. కానీ సిడ్నీలో మాత్రం భారత ఆటగాళ్లు ప్రాక్టీసు చేసొచ్చిన తర్వాత గ్రిల్ చేయని చల్లని శాండ్ విచ్ పెట్టారు. అది కూడా చాలా నార్మల్ గా ఉంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇదంతా చూస్తుంటే.. భారత ఆటగాళ్లని డైరెక్ట్ గా ఫేస్ చేయలేక, ఫిజికల్ గా డౌన్ చేయాలని ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే క్రికెటర్లు గానీ వేరే అథ్లెట్లు గానీ ఫిట్ అండ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే హెల్తీ ఫుడ్ కావాలి. ఒకవేళ అలాంటివి తినకపోతే అది మ్యాచ్ లో ఆటపై ప్రభావం చూపిస్తుంది. మరి టీమిండియా క్రికెటర్లకు చల్లని ఫుడ్ పెట్టడం గురించి మీరేం అనుకుంటున్నారు.
Indian team is unhappy with the food after practice at Sydney, they were given just sandwiches and told ICC that it was cold & not good. (Source – ANI)
— Johns. (@CricCrazyJohns) October 26, 2022