సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనపరిచింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఆఖరిబంతి వరకు నువ్వా.. నేనా! అన్నట్లుగా సాగడం విశేషం. ఒకానొక సమయంలో బంగ్లా పైచేయి సాధించినప్పటికీ దాన్ని కొనసాగించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినప్పటికీ గెలవడానికి నానా కష్టాలు పడింది. ఈ విషయంతో టీమిండియా సెమీస్ బెర్త్ కు మరింత దగ్గరయ్యింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత బ్యాటర్లు చెలరేగిఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ(2) విపలమైనా, కేఎల్ రాహుల్(50; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) విరాట్ కోహ్లీ(64; 44 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీలతో అలరించారు. ఇక సూర్యకుమార్ యాదవ్(30; 16బంతుల్లో 4 ఫోర్లు) ఎప్పటిలానే కాసేపు మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి టీమిండియా 184 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్ లిటన్ దాస్(60) మంచి శుభారంభం అందించాడు. అతడి ధాటికి బంగ్లాదేశ్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది.
Litton Das’ run out turned the chase around, he was batting superbly #T20WorldCup #INDvBAN
👉 https://t.co/mRp7bYKCJr pic.twitter.com/kep9HwuPud
— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2022
ఈ సమయంలో మ్యాచుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులకు కుదించారు. ఆపై ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకు పోరాడిన బంగ్లా బ్యాటర్లు 145 పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్, హార్దిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, షమీ 1 వికెట్ తో రాణించాడు. ఈ విజయంతో భారత్ సెమీస్ బెర్త్ కు దాదాపుగా కన్ఫార్మ్ చేసుకుంది. భారత్ తదుపరి మ్యాచులో జింబాబ్వేతో తపడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 6న మెల్ బోర్న్ వేదికగా జరగనుంది.
.@imVkohli bagged the Player of the Match award as #TeamIndia beat Bangladesh in Adelaide. 👌 👌
Scorecard ▶️ https://t.co/Tspn2vo9dQ#T20WorldCup | #INDvBAN pic.twitter.com/R5Qsl1nWmf
— BCCI (@BCCI) November 2, 2022
Here’s how things look in Group 2 after India’s win over Bangladesh 👇#T20WorldCup pic.twitter.com/J7C1U5hqHh
— The Cricketer (@TheCricketerMag) November 2, 2022