టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ గెలిచింది. పాకిస్థాన్ పై అద్భుత విజయం సాధించింది. పన్నెండేళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్ ని ముద్దాడింది. ఈ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ గెలవడం గొప్పకాదు.. కానీ గెలిపించింది స్టోక్స్ కావడం విశేషం. ఎందుకంటే ఓ జట్టు ఫైనల్లో ఆడుతుందంటే చాలా ప్రెజర్ ఉంటుంది. అలాంటి టైంలో ఎంతో జాగ్రత్తగా ఆడాలి. దాన్ని వందకు వందశాతం బెన్ స్టోక్స్ చేసి చూపించాడు. అయితే స్టోక్స్ టీ20 వరల్డ్ కప్ విజయానికి కారణమవ్వడం గొప్ప కాదు.. కానీ ఆరేళ్లలో పూర్తిగా సీన్ మార్చేశాడు చూడు అది గొప్ప.
ఇక ఈ విషయం గురించి చెప్పాలంటే మనం ఆరేళ్ల వెనక్కి వెళ్లాలి. 2016 టీ20 వరల్డ్ కప్ అది. ఫైనల్లో ఇంగ్లాండ్-వెస్టిండీస్ తలపడ్డాయి. చివరి ఓవర్ లో విండీస్ గెలవాలంటే 24 పరుగులు కావాలి. అలాంటి టైంలో బౌలింగ్ చేసిన స్టోక్స్.. బ్యాటర్లని కట్టిడి చేద్దామనుకున్నాడు. కానీ బ్రాత్ వైట్ విధ్వంసం దెబ్బకు పూర్తిగా సీన్ మారిపోయింది. వరసగా నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు కొట్టేసరికి.. స్టోక్స్ మైదానంలో తలదించుకుని కూలబడిపోయాడు. అప్పుడు అందరూ స్టోక్స్ పై విమర్శలు చేశారు. కానీ వాటిని అన్నింటిని మనసులో పెట్టుకున్న స్టోక్స్ ప్రతిదానికి బదులివ్వాలని అప్పుడే ఫిక్సయ్యాడు.
ఇక 2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన స్టోక్స్, ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా మారాడు. అది జరిగిన మూడేళ్లకు అంటే 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ స్టోక్స్ కీలకపాత్ర పోషించాడు. అప్పుడు బంతితో పూర్తిగా నిరాశపరిచిన ఇతడు.. ఈసారి మాత్రం బ్యాట్ తో రెచ్చిపోయాడు. న్యూజిలాండ్ జట్టుని చిత్తు చేస్తూ.. ఇంగ్లాండ్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ ముద్దాడటంలో కీలకపాత్ర పోషించాడు. ఇది జరిగిన మూడేళ్లకు అంటే ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ని ఇంగ్లాండ్ మరోసారి గెలుచుకోవడంలో స్టోక్స్ మెయిన్ గా నిలిచాడు.
బెన్ స్టోక్స్ లైఫ్ లో ఇంట్రెస్టింగ్ విషయంలో ఏంటంటే.. అతడిది న్యూజిలాండ్. అయినా సరే ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఎదిగాడు. ఇదే జట్టుకి కెప్టెన్ గా కూడా చేశాడు. కోహినూర్ లాంటి డైమండ్ ఇంగ్లాండ్ లో ఉన్నట్లు.. డైమండ్ లాంటి క్రికెటర్ స్టోక్స్ కూడా ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. అందుకే అతడు రియల్ హీరో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు స్టోక్స్ లైఫ్ ని గుర్తుచేసుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ స్టోక్స్ గానీ టీమిండియా క్రికెటర్ అయ్యుంటే మాత్రం బహుశా ఈపాటికే బయోపిక్ కూడా అనౌన్స్ చేసేవారు!
🏆Ashes 2019
🏆WC 2019 Final
🏆T20 WC 2022 FinalBEN STOKES – THE CLUTCH PLAYER🙇 pic.twitter.com/EUD5ln5fmY
— CricTracker (@Cricketracker) November 13, 2022
What a journey for Ben Stokes from 2016 to 2022. pic.twitter.com/C6z37J6vHO
— Johns. (@CricCrazyJohns) November 13, 2022
2016 ➡️ 2019 ➡️ 2022
Ben Stokes, TAKE A BOW.#PAKvENG #T20WorldCup pic.twitter.com/4heOtyFQ29
— ESPNcricinfo (@ESPNcricinfo) November 13, 2022
BEN STOKES!
That’s it, that’s the tweet ✨ pic.twitter.com/eHYT9YQzgH
— Sportstar (@sportstarweb) November 13, 2022
2016 – Ben Stokes bowled the final ball of the T20 World Cup.
2022 – Ben Stokes hit the winning runs of the T20 World Cup. pic.twitter.com/azJvdvbgmP
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 13, 2022
A story in four photos.
Ben Stokes is a mentality monster.
World Class. pic.twitter.com/YJtTWvMHgb
— Cricket Shouts (@crickshouts) November 13, 2022