భారత్ క్రికెట్ గురించి ప్రస్తావన వస్తే ఐపీఎల్ ముందు.. ఐపీఎల్ తర్వాత అని అంటారు. ఎందుకంటే అప్పటివరకు పాసింజర్ ట్రైన్ లా వెళ్తున్న మన జట్టు.. ఒక్కసారిగా సూపర్ ఫాస్ట్ వేగం అందుకుంది. బుమ్రా, హార్దిక్ పాండ్య లాంటి కుర్రాళ్లు.. ఈ లీగ్ లో అదరగొట్టి, జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే 14 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ రిచ్ లీగ్ గురించి అంతా ప్లస్ అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ప్రపంచంలో స్టార్ క్రికెటర్లు ఎవరు ఫెయిలైనా సరే.. ఫస్ట్ విమర్శించేది ఐపీఎల్ నే. ఇప్పుడు అలాంటి ఐపీఎల్ పై ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. అలాంటిది ఇప్పుడు అదే బీసీసీఐకి బిగ్ ప్లస్ పాయింట్ అయింది. వేలకోట్లు తెచ్చిపెడుతోంది. మరోవైపు టీమిండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎవరు ఫెయిలైనా సరే చాలామంది ఈ లీగ్ పైనే విమర్శలు చేస్తుంటారు. అంతెందుకు ఆసియాకప్ లో భారత్ వైఫల్యం తర్వాత ఏకంగా ఐపీఎల్ ని బ్యాన్ చేయాలని డిమాండ్స్ వినిపించాయి. పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ తీసుకొచ్చి, టీమిండియాని నాశనం చేశారని అక్కసు బయటపెట్టారు. ఇదంతా పక్కనబెడితే ఐపీఎల్ వల్లే తాను స్టార్ క్రికెటర్ గా మారానని ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ చెప్పాడు.
‘ఐపీఎల్ వల్ల నా క్రికెట్ పూర్తిగా మారిపోయింది. ఆటలో ఎలా భాగం కావాలి. గేమ్ ని ఎలా చదవాలనే విషయాల్ని ఐపీఎల్ లోనే బాగా అర్ధం చేసుకున్నాను. ఈ లీగ్ వల్ల కష్టమైన పిచ్ లపై ఎలా ఆడాలో తెలిసింది. అత్యుత్తుమ కోచులు, వరల్డ్ బెస్ట్ ప్లేయర్లతో డ్రస్సింగ్ రూం షేర్ చేసుకోవడం, వారి దగ్గర నుంచి విలువైన సలహాలు నేర్చుకునే అవకాశం దక్కింది. అదే నా ఆటని మార్చేసింది’ అని స్టోయినిస్ ఐపీఎల్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇక తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి స్టోయినిస్ అదరగొట్టాడు. టీ20 వరల్డ్ కప్ లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా సరికొత్త రికార్డు సృష్టించాడు. మరి స్టోయినిస్, ఐపీఎల్ పై మాట్లాడటంపై మీ అభిప్రాయం కామెంట్స్ లో పోస్ట్ చేయండి.