గతంలో జరిగిన అన్ని ప్రపంచ కప్ లో ఒకెత్తు అయితే.. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 మరో ఎత్తు. సంచలనాలతో మెుదలైన ఈ టోర్నీ రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. దాంతో ప్రతీ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రతీ జట్టు కెప్టెన్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగానే వారు పరుగులు చేయడంతో వెనకబడుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగానే మెున్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 40 బంతుల్లో 40 పరుగులు చేసి న్యూజిలాండ్ ఓటమికి కారణం అయ్యాడు కేన్ విలియమ్సన్. దాంతో అతడిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. టెస్ట్ బ్యాటింగ్ అంటూ ట్రోల్స్ చేశారు. వాటన్నింటికి ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో తన బ్యాట్ తో సమాధానం ఇచ్చాడు. రెచ్చిపోయి ఆడిన కేన్ మావ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు.
కేన్ విలియమ్సన్.. సమకాలీన క్రికెట్ చరిత్రలో అత్యంత నిలకడైన బ్యాటర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. టెస్ట్, వన్డే క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకుని కివీస్ జట్టుకు వెన్నెముకగా నిలుస్తూ వస్తున్నాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో నిన్నటి వరకు అంతగా ప్రభావం చూపలేకపోయాడు. అదీ కాక మెున్నటికి మెున్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 40 బంతులు ఎదుర్కొని కేవలం 40 పరుగులు చేశాడు. ఫలితంగా లక్ష్య ఛేదనలో తడబడ్డ కివీస్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో టీ20 లకు కేన్ మావ పనికి రాడని, టెస్ట్ బ్యాటింగ్ ఏంటి మావ అని నెటిజన్స్ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.
Captain Kane Williamson leading from the front in a must-win game.#CricTracker #KaneWilliamson #NZvIRE #T20WorldCup pic.twitter.com/JQ0tLtVht8
— CricTracker (@Cricketracker) November 4, 2022
ఈ నేపథ్యంలోనే ఆ విమర్శలకు, ట్రోల్స్ కు తాజాగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తన బ్యాట్ తో గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు విలియమ్సన్. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్ లతో 61 పరుగులు చేశాడు. ఫలితంగా కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. తనపై వస్తున్న విమర్శలకు ఈ మ్యాచ్ తో గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు కేన్ మామ. ఇక భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కు ఓపెనర్లు మంచి శుభారంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు స్టిర్లింగ్-బాల్బిరియన్ లు 8 ఓవర్లలో 68 పరుగులు జోడించారు. కానీ ఈ శుభారంభాన్ని సరిగ్గా వినియోగించుకోలేక పోయింది ఐర్లాండ్. ఓపెనర్లు వెనుదిరగడంతో క్రమంగా వికెట్లను కోల్పోయింది. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేసి 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా 5 మ్యాచ్ ల్లో 3 పాయింట్లు సాధించిన ఐర్లాండ్ ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ గెలవడం ద్వారా 5 మ్యాచ్ ల్లో 7 పాయింట్లు సాధించి టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
Kane Williamson departs after a fine knock.
📸: Disney+Hotstar#Cricket #CricTracker #KaneWilliamson #T20WorldCup pic.twitter.com/uvFZEgUbjS
— CricTracker (@Cricketracker) November 4, 2022