ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 తుది అంకానికి చేరుకుంది. మరో మూడు మ్యాచ్‌ల్లో పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేత ఎవరూ తేలిపోనుంది. గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్.. గ్రూప్ బీ నుంచి భారత్, పాకిస్థాన్ సెమీస్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ నెల 9న న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య తొలి సెమీస్ జరగనుంది. అలాగే 10న టీమిండియా.. ఇంగ్లండ్‌తో రెండో సెమీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నాయి. కాగా.. టీమిండియాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు దూరం అయ్యేలా ఉన్నాడు.
మలాన్ దూరం అయితే ఇంగ్లండ్ జట్టుకు పెద్ద దెబ్బ పడినట్లే. మలాన్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడకుంటే సెమీస్‌లో టీమిండియాను ఢీ కొనడం ఇంగ్లండ్ జట్టుకు తలకుమించిన భారం అవుతుంది. మలాన్ గైర్హాజరీతో ఇంగ్లీష్ జట్టు బలహీనంగా మారనుంది. ఆ జట్టులో ఏ ఆటగాడు కూడా నిలకడగా ఆడటం లేదు. కెప్టెన్ జోస్ బట్లర్ ఒక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు అంతే. ఇక మిగతా బ్యాటర్ల నుంచి ఆశించిన ప్రదర్శన రావడం లేదు. దీనికి తోడు మలాన్ గాయం ఆ జట్టును మరింత కలవర పెడుతుంది. సెమీస్‌లో టీమిండియా లాంటి బలమైన ప్రత్యర్థితో తలపడబోతున్న జట్టుకు.. కీలక ఆటగాడు దూరం కావడం ఆ జట్టు మానసిక స్థైర్యాన్ని సైతం దెబ్బతీస్తోంది.
అయితే.. గ్రూప్ దశలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా మలాన్ గాయపడ్డాడు. ఇంగ్లండ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 15వ ఓవర్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ.. గాలి గజ్టల్లో నొప్పితో మలాన్ మైదానం వీడాడు. ప్రస్తుతం మలాన్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. సెమీస్ ఫైనల్ మ్యాచ్‌కు మరో రెండు రోజుల సమయం ఉండటంతో.. మలాన్ కోలుకుంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కానీ.. గాయం తీవ్రత మాత్రం వారిని కలవరపెడుతోంది. అయితే ఒకవేళ మలాన్ సెమీస్ ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుంటే.. అతని స్థానంలో ఫిల్ సాల్ట్‌ను ఆడించే అవకాశం ఉంది. బౌలింగ్‌లో కాస్త బలహీనంగా కనిపిస్తున్న ఇంగ్లండ్.. మలాన్ లేకపోవడంతో మరింత వీక్‌గా మారింది.
Dawid Malan is likely to miss the Semi-final against India. (Source – TMS)
— Johns. (@CricCrazyJohns) November 7, 2022