ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022పై వర్షం మ్యాచ్‌లకు మ్యాచ్‌లే ఎగరేసుకుపోతోంది. వర్షం కారణంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. తాజాగా గ్రూప్ ఏలో పెద్ద టీమ్స్ అయిన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన బిగ్ ఫైట్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. కాగా.. ఈ మ్యాచ్ రద్దు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ రెండు జట్లకు భారీ నష్టమే చేసింది. ముఖ్యంగా ఇంగ్లండ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇంగ్లండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లే ముగిలి ఉన్నాయి. అవి రెండు కూడా టఫ్ టీమ్స్‌తోనే. ఒకటి న్యూజిలాండ్‌తో కాగా.. మరొకటి శ్రీలంకతో ఈ రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఇంగ్లండ్ ఓడినా.. లేదా దురదృష్టవశాత్తు వర్షం కారణంగా ఒక్క మ్యాచ్ రద్దయినా.. ఇంగ్లండ్ ఇంటికి వెళ్లడం దాదాపు ఖయమే.
ఇక ఆస్ట్రేలియా కూడా సెమీస్ చేరడం అంత సులవైన పనికాదు. ఆసీస్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకటి ఐర్లాండ్‌తో, రెండోది అఫ్ఘానిస్థాన్‌తో.. ఈ రెండు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా గెలిచినా.. శ్రీలంక ఓడిపోవాలి. ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ఓడాలి.. ఈ రెండింటిలో ఏ ఒక్కటి జరగకున్నా.. ఆస్ట్రేలియా సెమీస్ చేరదు. గ్రూప్ ఏలో సెమీస్ అవకాశాలు మెండుగా ఉన్నది ఒక్క న్యూజిలాండ్‌కే. మిగతా ఐదు జట్లు కూడా సెమీస్ చేరడానికి యుద్ధం చేయాల్సిందే. కొన్ని జట్లు మిగిలి ఉన్న మ్యాచ్‌లన్నీ గెలిచి కూడా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సింది. వర్షాలకు తోడు.. చిన్న జట్లు సృష్టిస్తున్న సంచలనాలు కూడా పెద్ద జట్ల తలరాతను మార్చేస్తున్నాయి.
ప్రస్తుతానికి న్యూజిలాండ్ 2 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరో మ్యాచ్ రద్దు అవ్వడంతో 3 పాయిట్లు, 4.450 నెట్ రన్‌రేట్‌తో తొలి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఇంగ్లండ్ 3 మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో 3 పాయిట్లు 0.239 రన్‌రేట్‌తో ఉంది. మూడో స్థానంలో ఐర్లాండ్ మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమి, ఒక రద్దు తో 3 పాయింట్లు, మైనస్ 1.169 రన్‌రేట్‌తో ఉంది. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక ఓటమి, ఒక రద్దుతో 3 పాయిట్లు, మైనస్ 1.555 రన్‌రేట్‌తో ఉంది. ఐదో స్థానంలో శ్రీలంక 2 మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో రెండు పాయింట్లు సాధించి 0.450 రన్‌రేట్‌తో ఉంది. చివరి స్థానంలో అఫ్ఘానిస్థాన్ 3 మ్యాచ్‌ల్లో ఒక ఓటమి రెండు రద్దులతో 2 పాయింట్లతో మైనస్ 0.620 రన్‌రేట్‌తో ఉంది.
AUS vs ENG match called off.
NZ vs AFG match called off.
SA vs ZIM match called off.
AFG vs IRE match called off.Rain winning T20 World Cup 2022.
— Johns. (@CricCrazyJohns) October 28, 2022
AUS vs ENG: “At Some Point Someone’s Going To Pay A Price, And Hopefully That’s Australia”- Matthew Mott Backs Ben Stokes To Deliver Against Arch-Rivals https://t.co/qrSCJrPKph
— Call4prediction (@call4prediction) October 28, 2022