టీ20 ప్రపంచ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీమిండియా. దానికి తగ్గట్లుగానే తన తొలి మ్యాచ్ లో పాక్ ను ఓడించింది. కానీ తర్వాతి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై తడబడింది. అనంతరం మళ్లీ పుంజుకుని నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ లను చిత్తుచేసింది. దాంతో 4 మ్యాచ్ ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓ యువ క్రికెటర్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాలి. అతడే టీమిండియా మరో జహీర్ ఖాన్ గా పిలుచుకుంటున్న అర్షదీప్ సింగ్. ఆసియా కప్ లో క్యాచ్ డ్రాప్ చేసి దేశ ద్రోహి అని నెటిజన్స్ తో ట్రోల్స్ కు గురయ్యాడు అర్షదీప్. ఈ సంఘటన దేశంలో సంచలనం సృష్టించింది. కానీ వాటన్నింటిని అధిగమించి గొప్ప స్థాయికి చేరుకున్నాడు అర్షదీప్. వరల్డ్ కప్ లో 9 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు.
భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్.. ఈ ముగ్గురు టీ20 వరల్డ్ కప్ లో భారత బౌలింగ్ దళానికి పెద్ద దిక్కు అని అందరు అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ లో టీమిండియా బౌలింగ్ దళానికి పెద్దదిక్కుగా మారాడు అర్షదీప్ సింగ్. కంటిన్యూస్ గా వికెట్లు తీస్తూ.. భారత్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మెున్నటి ఆసియా కప్ మ్యాచ్ లో కీలక క్యాచ్ డ్రాప్ చేయడంతో.. అర్షదీప్ సింగ్ పై భారీ ఎత్తున ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. అవి ఎత్తలా అంటే అతడి వికీపీడియాలో అతడి నేషనాలిటి అనే దాని దగ్గర ఖలిస్తాన్ అని కొందరు దుండగులు ఎడిట్ చేశారు. ఈ వివాదంపై వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే.
Arshdeep Singh in the T20 World Cup 2022:
4-0-32-3
4-0-37-2
4-0-25-2
4-0-38-29 wickets from 4 games, the leader of the attack. pic.twitter.com/OCLWJ8m2cm
— Johns. (@CricCrazyJohns) November 2, 2022
దాంతో తీవ్ర మనోవేదనకు గురైన అర్షదీప్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా కింగ్ కోహ్లీ సైతం మద్దతు పలికారు. అయితే ఒక ఆటగాడికి కెరీర్ లో ఒడిదొడుకులు రావడం సహజమే. వాటిని తట్టుకుని నిలబడిన వాడే అసలైన హీరోగా జీవితంలో నిలబడతాడని అర్షదీప్ నిరూపించాడు. దిగ్గజ బౌలర్లను దాటుకుని ఈ ప్రపంచ కప్ లో 4 మ్యాచ్ ల్లో 9 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జాబితాలో సామ్ కర్రన్ తో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. జట్టులో అనుభవం ఉన్న బౌలర్లు అయిన భువీ, అశ్విన్, షమీలు కూడా అర్షదీప్ దరిదాపుల్లో లేరు.
ఇక అర్షదీప్ సింగ్ గణాంకాలను పరిశీలిస్తే.. తొలి మ్యాచ్ లో పాక్ పై 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, తాజాగా బంగ్లాదేశ్ లపై రెండు వికెట్లు తీసి జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. వికెట్ల తీయ్యడమే కాకుండా డెత్ ఓవర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. తక్కువ పరుగులిస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ ఏజ్ లోనే.. ఇంత తక్కువ గ్యాప్ లోనే అర్షదీప్ కమ్ బ్యాక్ కావడం నిజంగా అద్భుతం అంటూ.. అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు క్రీడానిపుణులు. దేశద్రోహి అన్న నోర్లే.. ఇప్పుడు అర్షదీప్ హీరో అంటూ పొగుడుతున్నాయి. ఇది కదా ఓ ఆటగాడికి కావాల్సిన అసలైన విజయం.
SARDAR IS ASARDAR ❤️#CricTracker #ArshdeepSingh #INDvBAN #T20WorldCup pic.twitter.com/0EVx9IRrUF
— CricTracker (@Cricketracker) November 2, 2022