యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 ప్రారంభం అయ్యింది. దాంతో కళ్లన్నీ భారత్, పాకిస్థాన్ ల మీదే. కానీ అనూహ్యంగా శ్రీలంక విజృంభించి ఆరోసారి కప్ ను కైవసం చేసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేసింది లంక. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లో పాకిస్థాన్ ను 23 పరుగులతో ఓడించి కప్ ను ముద్దాడింది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు అందరు లంకను తక్కువ అంచనా వేశారు. లంక అసలు పోటీనే కాదు అన్న నోర్లే నేడు లంకను ప్రశంసిస్తున్నాయి. బ్యాటింగ్ లో రాజపక్స.. బౌలింగ్ లో మదుషాన్.. ఇక ఆల్ రౌండర్ హసరంగ మెరుపులతో ఆసియా కప్ ఫైనల్లో ఘర్జించింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
శ్రీలంక.. దేశంలో ఓవైపు రాజకీయ సంక్షోభం.. ఆర్థిక పరిస్థితులు దిగజారడం.. లాంటి సమస్యలతోనే లంక ఆసియా కప్ కు బయలు దేరింది. అప్పటి వరకు లంకను అందరు పట్టించుకోలేదు. దానికి తగ్గట్లే ఆఫ్గాన్ పై ఓటమితో వారు అనుకుంటుందంతా నిజమనే భావనలోకి వచ్చారు. కానీ అనూహ్యంగా పుంజుకున్న లంక వరుసగా విజయాలు సాధిస్తూ ఫైనల్ కు దూసుకొచ్చింది. ఇక ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెుదటగా టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లంకకు తొలి ఓవర్ లోనే ఎదురు దెబ్బ తగిలింది. నసీమ్ తన తొలి ఓవర్ 3వ బంతికే కుశాల్ మెండిస్ (0)ను బౌల్డ్ చేశాడు. ఒకవైపు నసీమ్ షా.. మరో వైపు రవూఫ్ తమ పదునైన బంతులతో లంకను బెంబేలెత్తించారు.
ఇక నాలుగో ఓవర్లో రవూఫ్.. నిశాంకను(8) పెవిలియన్ కు చేర్చాడు. తర్వాత లంక బ్యాట్స్ మెన్ వరుసగా గుణతిలక (1), డిసిల్వా(28), శానక (2) పరుగులకు వెనుదిరిగారు. దీంతో లంక 9 ఓవర్లలో 58/5 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన రాజపక్స్ తన అద్బుతమైన బ్యాటింగ్ తో లంకకు 170/6 స్కోరును అందించాడు. బానుక రాజపక్స 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. రాజపక్స కు అండగా 36 పరుగులతో హసరంగ డిసిల్వా నిలిచాడు. పాక్ బౌలర్లలో రవూఫ్ 29/3 వికెట్లతో రాణించాడు. అనంతరం 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ప్రమోద్ మదుషాన్ (34/4) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. పాక్ జట్టులో రిజ్వాన్ 49 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 55 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాకిస్థాన్ ఏదశలోనూ లక్ష్యం వైపు సాగలేదు.
ఈ క్రమంలో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లోనే మదుషాన్ పాక్ కు భారీ షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో బాబర్ అజామ్(5), ఫకార్ జమాన్(0) పెవీలియన్ కు పంపాడు. లంక బౌలర్లు అద్బుతంగ బౌలింగ్ చేయడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. మ్యాచ్ కొన్ని ఓవర్ల ముందే లంక విజయం ఖాయం అయ్యింది. మదుషాన్ కు తోడుగా హసరంగ 27/3 తో పాక్ పతనాన్ని శాసించాడు. దాంతో 20 ఓవర్లలో పాక్ 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 23 పరుగుల తేడాతో లంక ఆరోసారి ఆసియా కప్ ను ముద్దాడింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బానుక రాజపక్స్ అందుకోగా.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను లంక ఆలౌ రౌండర్ హసరంగ గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ను శ్రీలంక గెలవడానికి గల కారణాలను పరిశీలిద్దాం.
ఏజట్టు విజయం సాధించాలి అన్నా సారథి దృఢంగా ఉండాలి. అతడి వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు ప్రత్యర్దిని ఒత్తిడిలోకి నెట్టెలా ఉండాలి. శనక స్వతహాగా ఆలౌ రౌండర్ కాబట్టి పరిస్థితులను ఈజీగా అర్దం చేసుకోగులుగుతున్నాడు. ఇతడి ప్రధాన ఎత్తుగడ ఏంటంటే మ్యాచ్ కు ముందే ప్రెస్ మీట్ ద్వారా తన ప్లాన్ ఏంటో చెప్పి ప్రత్యర్దిని ఆలోచనలో పడేసేవాడు.
యాషెస్ టెస్ట్ సిరీస్ పరాజయం తర్వాత ఇంగ్లాండ్ కోచ్ గా క్రిస్ వైదొలిగాడు. ఆ తర్వాత లంక కోచ్ గా పగ్గాలు చేపట్టాడు. అప్పటికే లంక టీం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. క్రిస్ వచ్చాక టీంలో సమూల మార్పులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో, ఓపెనింగ్ విషయంలో, బౌలింగ్ లో మార్పులు చేశాడు. అతడు చేపట్టిన ప్రయోగాలు జట్టును విజయ తీరాలకు చేర్చాయి. ప్రతీ ఆటగాడిని తీక్షణంగా పరీక్షించేవాడు. అతడి బలం ఏంటో తెలుకుని అతడిని వాడుకునే వాడు.
లంకకు ప్రధానం బలం ఆ జట్టు ఓపెనర్లు నిశాంక, కుశాల్ అనడంలో సందేహం లేదు. ఇక తాజా ఆసియా కప్ లో నిశాంక 6 మ్యాచ్ ల్లో 173 పరుగులు చేశాడు. మరో వైపు మండిస్ సైతం 155 పరుగులతో సత్తా చాటాడు. భారత్ పై వీరి జోడి ఎలా రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కరర్లేదు. వీరు దాదాపు ప్రతీ మ్యాచ్ లో లంకకు శుభారంభం అందించేవారు. దాంతో జట్టు స్వేఛ్చగా పరుగులు చేసి విజయాలు సాధించారు. నిశాంక కొంత నెమ్మదిగా ఆడుతాడు.. కానీ మెండిస్ మాత్రం ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. దాంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై పెద్దగా ఒత్తిడి ఉండేది కాదు. ఇది లంక విజయం లో ప్రధాన కారణం.
కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించడంలో బానుక రాజపక్స ది ప్రధాన పాత్ర. ఒక్క బంగ్ల మ్యాచ్ లో తప్ప ప్రతీ మ్యాచ్ లో అతడు రాణించాడు. ఈ ఆసియా కప్ లో అతడు ఏకంగా149 స్ట్రైక్ రేటుతో 191 రన్స్ చేశాడు. తాజాగా పాక్ తో ఫైనల్లో 36 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న లంకను 170/6 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచిందంటే అది రాజపక్స్ బ్యాటింగ్ దయే.
ఈ టోర్నీలో లంక ప్రధాన ఆయుధం బౌలింగే అని చెప్పాలి. ఆలౌ రౌండర్ హసరంగా అద్బుతమైన తన బౌలింగ్ తో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు. 6 మ్యాచ్ ల్లో 9 వికెట్లు తీయడమే కాకుండా 66 పరుగులు సైతం చేశాడు. హసరంగకు తోడుగా మదుషాన్ కూడా 6 వికెట్లు తీశాడు. అతడు ఫైనల్లో 4 వికట్లతో సత్తా చాటాడు. మిగతా బౌలర్లలో కరుణరత్నే 7 వికెట్లు, తీక్షణ మహేశ్, మధుశంక 6 వికెట్లతో తమవంతు పాత్ర వహించారు. ఏ జట్టు అయినా సమష్టిగా రాణిస్తేనే గెలుపు సాధిస్తుంది అనడానికి నిదర్శనం ప్రస్తుతం లంక ఆసియా కప్ లో చేసిన ప్రదర్శనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి లంక ఆసియా కప్ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The winning celebration from the Head Coach Chris Silverwood – sacked after an Ashes defeat, but loaded himself again, joined Sri Lanka in their toughest times and now they’re the champions of Asia Cup 2022. pic.twitter.com/cBomb7Bre7
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2022
Deserves to be the player of the #AsiaCup2022 🙌#SLvPAK #Hasaranga pic.twitter.com/Hzdu4tDtTU
— Cricket Pakistan (@cricketpakcompk) September 11, 2022
Dasun Shanaka with the Asia Cup title. Huge credit goes to him for this incredible win.
Shanaka – The Captain, leader, Legend. pic.twitter.com/qQIgFTHakP
— CricketMAN2 (@ImTanujSingh) September 11, 2022