అంతర్జాతీయ క్రికెట్‌లో వీలైనంత త్వరగా తక్కువ వయసులోనే ఎంట్రీ ఇచ్చి.. 30, 35 ఏళ్ల లోపే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఆ వయసులోనే ఎవరైన చాలా ఫిట్‌గా ఉంటారు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత చాలా మంది కామెంటేటర్లుగా, కోచ్‌లుగా రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెడతారు. పేరు క్రికెట్ ఫీల్డ్‌లోనే ఉన్నా.. ఆడుతున్న సమయంలో ఫిట్‌నెస్‌పై పెట్టినంత ఫోకస్ ఆ తర్వాత పెట్టరు. రిటైర్మెంట్ తర్వాత చారిటీ మ్యాచ్‌ల్లో ఆడినా ఏదో నామ్‌కే వాస్తే అన్నట్లు ఉంటుంది. కానీ.. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడుతున్న సౌతాఫ్రికా మాజీ దిగ్గజం జాంటీ రోడ్స్ మాత్రం అందుకు భిన్నంగా యువ క్రికెటర్ కంటే దారుణంగా రెచ్చిపోతున్నాడు. శనివారం సచిన్ కెప్టెన్సీలోని ఇండియా లెజెండ్స్.. జాంటీ రోడ్స్ సారథ్యంలోని సౌతాఫ్రికా లెజెండ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్ టీమ్ తొలుత ఫీల్డింగ్ చేసింది. ఆ టీమ్ కెప్టెన్ జాంటీ రోడ్స్ 53 ఏళ్ల వయసులో కూడా తన ఫేవరేట్ ప్లేస్ పాయింట్‌లోనే ఫీల్డింగ్ నిలబడ్డాడు. ఒక క్యాచ్ కూడా అందుకున్నాడు. పైగా.. గాల్లోకి అద్భుతంగా డై చేస్తూ.. చేసిన ఫీల్డింగ్ అయితే మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన జాంటీ ఇలాంటి ఫీల్డర్ చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అనుకుంటే.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ములేపాడు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ లాంటి హేమాహేమీలు విఫలం అయిన చోట భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సౌతాఫ్రికా స్టార్ పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ వచ్చి బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించింది. రాహుల్ శర్మ బౌలింగ్‌లో ఒక రివర్స్ హిట్, ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో ఒక రివర్స్ హిట్, మోకాళ్లపై కూర్చోని ఒక భారీ షాట్ ఆడి అందర్ని షాక్‌కు గురిచేశాడు. 38 పరుగులతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్ 16 పరుగులు మాత్రమే చేసి త్వరగానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓజా (21), సురేష్ రైనా (33), యువరాజ్ సింగ్ (6) సైతం తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. 42 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 82 పరుగులు నాటౌట్, యూసుఫ్ పఠాన్ 15 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 35 పరుగులు చేసి చెలరేగారు. దీంతో ఇండియా లెజెండ్స్ భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. ఇండియా లెజెండ్స్ 61 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. స్టువర్ట్ బిన్నీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారత బౌలర్లలో రాహుల్ శర్మ 3, మునాఫ్ పటేల్ 2, ఓజా 2, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా లెజెండ్స్ బ్యాటర్లలో జాంటీ రోడ్స్ 38 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. మరి ఈ మ్యాచ్‌లో జాంటీ రోడ్స్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: 53 ఏళ్ల వయసులోనూ కళ్లు చెదిరే ఫీల్డింగ్! హ్యాట్సాఫ్ జాంటీ రోడ్స్