టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. అసలు అంచనాల్లేని దక్షిణాఫ్రికా జట్టు దాన్ని రియాలిటీలో చేసి చూపించింది. దీంతో క్రికెట్ ప్రేమికులు షాకయ్యారు. అసలు ఈ రేంజ్ 'బ్యాటింగ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్' అని మాట్లాడుకుంటున్నారు.
క్రికెట్ లో టీ20 మ్యాచులు సరికొత్త ఊపును తీసుకొచ్చాయి. ఆటలో వేగం పెంచాయి. 2007 టీ20 ప్రపంచకప్ తో మొదలైన ఈ ధనాధన్ ఆట.. ప్రస్తుతం అయితే ఇదే ముఖ్యం అన్నంతగా మారిపోయింది. ప్రేక్షకులు కూడా టెస్టు, వన్డేల కంటే 20 ఓవర్ల గేమ్ చూడటానికే బాగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే టీ20ల్లో అప్పుడప్పుడు సరికొత్త రికార్డులు నమోదవుతూ ఉంటాయి. కానీ తాజాగా దక్షిణాఫ్రికా మాత్రం ఏ జట్టుకి సాధ్యం కానీ అరుదైన ఘనత సృష్టించింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాతో పాటు క్రికెట్ వర్గాల్లోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20ల్లో అత్యధిక స్కోర్లు చేయడం అప్పడప్పుడు జరుగూతూ ఉంటుంది. సెంచూరియన్ వేదికగా వెస్టిండీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టీ20లోనూ సరికొత్త ఘనత నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో సఫారీ బ్యాటర్లకు కష్టమని అనుకున్నారు. కానీ ఓపెనర్ డికాక్ మాస్ జాతర చూపించాడు. 44 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ కూడా ధనాధన్ ఆటతో 68 పరుగులు చేశాడు. అలా వీళ్లిద్దరూ మాస్ బ్యాటింగ్ తో 18.5 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.
అయితే 2018లో న్యూజిలాండ్ పై టీ20లో ఆస్ట్రేలియా 245 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. తాజాగా దక్షిణాఫ్రికా జట్టు దీన్నే ఛేదించింది. వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు విండీస్ బ్యాటర్లు.. ఇతర జట్లపై రన్స్ కొట్టడం, టార్గెట్ ఛేజ్ చేయడం చూశాం. కానీ ఆ టీమ్ పైనే సౌతాఫ్రికా రెచ్చిపోయేసరికి అందరూ మెంటలెక్కిపోయారు. సరిగ్గా ఐపీఎల్ కు కొన్నిరోజుల ముందు ఇలాంటి రికార్డ్ సెట్ అయ్యేసరికి.. డికాక్ పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. మరి టీ20ల్లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
South Africa 🔥🥳#SAvWI #SAvsWI #CricketTwitter pic.twitter.com/hxImZpSUKf
— RVCJ Media (@RVCJ_FB) March 26, 2023