సచిన్ టెండుల్కర్ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మెన్. కానీ ఆ విషయంలో మాత్రం ఓ ఫెయిల్యూర్ ఆటగాడని పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. మరి సచిన్ ఈ విషయంలో ఫెయిల్యూరో ఇప్పుడు తెలుసుకుందాం.
సచిన్ టెండుల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. వేల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు, రివార్డులు.. ఇలా చెప్పుకుంటూ పోతే సమయం కూడా సరిపోదు. అందుకే అభిమానులు ముద్దుగా క్రికెట్ గాడ్ అని పిలుచుకుంటారు. మరి అలాంటి క్రికెట్ గాడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్థాన్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్. సచిన్ గొప్ప బ్యాట్స్ మెన్ అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ విషయంలో మాత్రం అతడు ఫెయిల్యూర్ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.
షోయబ్ అక్తర్.. ఎప్పుడు టైమ్ దొరుకుతుందా, ఎప్పుడు టీమిండియా ఆటగాళ్లపై నోరు పారేసుకుందామా అని ఎదురుచూస్తుంటాడు. తాజాగా సచిన్ టెండుల్కర్ గురించి మరోసారి చౌకబారు మాటలు మాట్లాడాడు. తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన్న ఇంటర్వ్యూలో సచిన్ ను కోహ్లీని పోలుస్తూ.. అక్తర్ ఈ విధంగా మాట్లాడాడు..” సచిన్ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మెన్.. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓ విషయంలో మాత్రం అతడు ఫెయిల్యూర్. ఆ విషయం ఏంటంటే? సచిన్ బ్యాట్స్ మెన్ గా ఎంత గొప్పగా రాణించాడో.. కెప్టెన్ గా అంత ఫెయిల్ అయ్యాడు. దాంతో తనంతట తానే కెప్టెన్ నుంచి తప్పుకున్నాడు. సారథిగా తనను తాను ఫ్రూవ్ చేసుకోలేక పోయాడు. ఓ ఫెయిల్యూర్ కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు” అని షోయబ్ అక్తర్ అన్నాడు.
అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాకే సచిన్ భీకర ఫామ్ లోకి వచ్చాడని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. సచిన్ లాగే కోహ్లీ సైతం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాకే పరుగులు చేశాడని అక్తర్ చెప్పుకొచ్చాడు. కోహ్లీని పొగడటం తన ఉద్దేశం కాదని, కేవలం ఇద్దరి మధ్య పోలికను మాత్రమే చెబుతున్నానని అక్తర్ తెలిపాడు. ఇక ప్రస్తుత కాలంలో కోహ్లీని మించిన బ్యాటర్ లేడని అక్తర్ ప్రశంసించాడు. సచిన్ లాగే కోహ్లీ సైతం కెప్టెన్సీ సమయంలో జట్టు భారాన్నంత మోశాడని కితాబిచ్చాడు. మరి సచిన్ ను ఫెయిల్యూర్ కెప్టెన్ గా అభివర్ణించిన షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.