టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ తన మోచేతిని కదలిస్తూ బౌలింగ్ చేసేవాడని అని చెప్పిన సెహ్వాగ్.. అది నిబంధనలకు విరుద్ధమని చెప్పుకొచ్చాడు. అయినా ఐసీసీ మాత్రం అతనిపై ఏనాడు చర్యలు తీసుకోలేదని చెప్పాడు. హోమ్ ఆఫ్ హీరోస్ పేరిట ఓ చానెల్ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలో పాల్గొన్న సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే.. ఈ ఇంటర్వ్యూలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ గురుంచి సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
అక్తర్ బౌలింగ్ ఓ చక్కర్ అని పేర్కొన్నసెహ్వాగ్.. ఆలా ఎందుకు పిలుస్తారో కూడా చెప్పుకొచ్చాడు.” అక్తర్ తన ఎల్బోను కదలిస్తూ బౌలింగ్ చేసేవాడు. ఈ తరహా బౌలింగ్‌ను క్రికెట్ భాషలో చక్కర్ అని సంబోధిస్తారు. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్ యాంగిల్ కాస్త డౌన్‌లో వస్తుంది.. అందువల్ల అతని బౌలింగ్ పెద్ద కష్టంగా అనిపించదు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ కూడా నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో ఒకడు. అతని స్వింగ్ బౌలింగ్ ఎక్కువగా ఆఫ్‌స్టంప్ అవతల పడుతూ బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టేవి. ఇక బ్రెట్ లీ బౌలింగ్‌లో ఆడడం పెద్దగా భయం లేనప్పటికి.. అక్తర్‌ను మాత్రం నమ్మలేం. అతను సంధించే బీమర్.. యార్కర్ ఎక్కడ నా కాలుకు తగులుతుందోనని భయపడేవాడిని. కానీ, అతని అదనపు పేస్ సహాయంతో బౌండరీలు ఈజీగా వెళ్లేవి.
ఇది కూడా చదవండి: Jofra Archer: జోప్రా ఆర్చర్ ను కుక్కతో పోల్చిన ముంబై ఇండియన్స్ అభిమాని!
“సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లు సెంచరీ కోసం 150 కి పైగా బంతులు తీసుకునేవారు. నేను కూడా వారిలానే ఆడితే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. ధాటిగా ఆడటమే నా స్టయిల్. 90ల్లో ఉన్నప్పుడు నిదానంగా ఆడటం నాకు నచ్చదు. సిక్సర్ బాదేందుకు ఏ మాత్రం సంశయించేవాడిని కాదు. ఎందుకంటే 100 కొట్టగలననే నాపై నమ్మకం ఉండేది’అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అయితే.. సెహ్వాగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. “సెహ్వాగ్ లాంటి బ్యాట్సమెన్ లేకుంటే.. ప్రతి మ్యాచ్ టెస్టు మ్యాచ్ లానే ఉంటదని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం “నీ లాంటి బ్యాట్సమెన్ 5 రోజుల ఆటకు పనికిరాడు” అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సెహ్వాగ్.. దిగ్గజ బౌలర్లందరిని బయపెట్టడానడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియాజేయండి.