టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లో హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి దుమ్మురేపాడు. తొలి మ్యాచ్‌లో ఆడిన రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో సంజూ శాంసన్‌కు రెండో టీ20లో ఓపెనర్‌గా తుది జట్టులో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు సంజూ. ఐర్లాండ్ బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడి.. కెరీర్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 9 బౌండరీలు, 4 సిక్సర్లతో వీర విహారం చేశాడు.
సెంచరీ దిశగా సాగుతున్న సంజూ అనూహ్యంగా మార్క్ అడైర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 176 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతున్న సంజూ సెంచరీ చేయడం ఖాయమని అభిమానులు భావించారు. కానీ నిరాశే ఎదురైంది. ఇక ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్, సెంచరీ మిస్ అవ్వడంపై సంజూ శాంసన్ స్పందించాడు.
సంజూ మాట్లాడుతూ.. ‘ఇది చాలా మంచి గేమ్. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో నేను, దీపక్ హుడా మంచి భాగస్వామ్యం అందించాం. నేను క్రీజులో కాస్త ఇబ్బందులు పడుతుంటే హుడా మాత్రం రెచ్చిపోయాడు. నేను కూడా హుడాను అనుసరించాను. హుడా సెంచరీ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే మ్యాచుల్లో నేను కూడా సెంచరీ సాధిస్తాను. కానీ ఈ మ్యాచ్ లో నేను ఆడిన ఇన్నింగ్స్ విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను..’అని చెప్పుకొచ్చాడు.
దేశవాళీ, ఐపీఎల్‌లో సత్తా చాటే సంజూ శాంసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. దాంతోనే అతను టీమిండియాలో సుస్థిర స్థానాన్ని పొందలేకపోతున్నాడు. అతని కన్నా వెనుక వచ్చిన ఆటగాళ్లు టీమిండియాకు రెగ్యూలర్‌గా ఆడుతుంటే.. ఎంతో ప్రతిభ కలిగిన సంజూ మాత్రం ఐపీఎల్‌కే పరిమితమయ్యాడు. మరి ఈ ఇన్నింగ్స్‌తో వచ్చిన ఆత్మవిశ్వాసంతోనైనా సంజూ మరిన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్‌గా మారలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. మరి సంజూ ఐర్లాండ్‌పై ఆడిన ఇన్సింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#SanjuSamson #INDvsIRE #IREvIND IND vs IRE: Sanju Samson Replies to Ajay Jadeja’s Remark, You Should’ve Scored a Century Too. @IamSanjuSamson @BCCI https://t.co/p5CCwZDDa1
— India.com (@indiacom) June 29, 2022