న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ చేసింది. కాగా చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ పట్టిన ఒక క్యాచ్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. చివరి టెస్ట్ నాలుగో రోజు న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న జాక్ లీచ్ వేసిన ఇన్నింగ్స్ 102వ ఓవర్‌లో కివీస్ బ్యాటర్ నీల్ వాగ్నర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతల్లో పడేలా వెళ్లింది. బెన్ ఫోక్స్‌కు కరోనా సోకడంతో స్టాండ్ ఇన్ కీపర్‌గా వచ్చిన సామ్ బిల్లింగ్స్ ఆ క్యాచ్‌ను జడ్జ్ చేయడంలో విఫలం అయ్యాడు. దీంతో బంతి అతని గ్లౌజ్‌లలో పడలేదు. నేరుగా ఛాతికి తాకి రెండు కాళ్ల మధ్యలోంచి కిందపడబోయింది. వెంటనే మెరుపువేగంతో స్పందించిన బిల్లింగ్స్ బాల్‌ను రెండు తొడల మధ్య అదిమి పట్టుకుని క్యాచ్‌ను కంప్లీట్ చేశాడు. దీంతో వాగ్నర్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
సింపుల్‌గా తీసుకోవాల్సిన క్యాచ్‌ను జారవిడిచిన బిల్లింగ్స్ వెంటనే తేరుకుని మొకాళ్లతో క్యాచ్ పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం బిల్లింగ్స్‌ను ఇతర ఆటగాళ్లు అభినందించారు. అలాగే తన సహచర ఆటగాడు బిల్లింగ్స్‌కు బాల్ తగిలిన చోటును చూపిస్తూ.. దెబ్బ గట్టిగా తగిలిందా? అని అడిగి.. ఇలాంటి క్యాచ్‌లను మరింత ఇంత క్లిష్టంగా పట్టొద్దు. ఇప్పటికైతే మొకాళ్లతో పట్టి బతికిపోయావ్. మరోసారి ఇలా జరక్కకుండా జాగ్రత్తగా క్యాచ్ పట్టు అంటూ వారిస్తున్నట్లు కనిపించింది. కాగా చివరి టెస్టులో కూడా ఇంగ్లండ్ ఘన విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. అలాగే జూలై 1 నుంచి ఇండియాతో రీషెడ్యూల్ చేసిన టెస్టు మ్యాచ్ ఆడనుంది. మరి సామ్ బిల్లింగ్స్ పట్టిన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
One crazy catch! 😅
Scorecard/clips: https://t.co/AIVHwaRwQv
🏴 #ENGvNZ 🇳🇿 @SamBillings pic.twitter.com/91U64cr51b
— England Cricket (@englandcricket) June 26, 2022