టీమిండియా యంగ్ స్టార్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం అయినా రుతురాజ్ కనీసం రెండో మ్యాచ్‌లోనైనా ఆడతాడని అంతా భావించారు. కానీ రుతురాజ్‌కు కుడిచేయి మణికట్టు గాయం తిరగబెట్టిందని.. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడని సమాచారం. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తుంది. గాయం తీవ్రత తేలకపోవడంతో మిగతా మ్యాచ్‌లకు రుతురాజ్ దూరమైనట్లు తెలుస్తుంది.
రుతురాజ్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో చండీఘర్‌లో ఉన్న మయాంక్ ధర్మశాలలో ఉన్న టీమ్‌తో జాయిన్ అయ్యాడు. మయాంక్ జట్టుతో కలిసినప్పటికి బయోబబూల్‌లో ఉంటాడని బీసీసీఐ పేర్కొంది. కాగా రుతురాజ్ వెస్టిండీస్‌తో ముగిసిన టి20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇప్పటికే గాయాల కారణంగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, సూర్యకుమార్ యాదవ్‌లు దూరమైన సంగతి తెలిసిందే.
కాగా యంగ్‌క్రికెటర్ ఇలా గాయాల కారణంగా సిరీస్‌లకు దూరమైతే కెరీర్‌పై ప్రభావం చూపుతుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కాగా లంకతో తొలి టి20లో టీమిండియా 62 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిదే. శనివారం రెండో మ్యాచ్ జరగనుంది. మరి రుతురాజ్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడనున్నాడు. చెన్నై అతన్ని రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందడడంతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ కూడా రుతురాజ్ గాయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరి రుతురాజ్ గాయంపై, సిరీస్‌కు దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
NEWS – Ruturaj Gaikwad ruled out of T20I series.
More details here – https://t.co/wHy55tYKfx @Paytm #INDvSL pic.twitter.com/9WM1Iox0ag
— BCCI (@BCCI) February 26, 2022