భారత్ టూర్ ఆఫ్ బంగ్లాదేశ్-2022లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ అదే పేలవ ప్రదర్శనతో అభాసుపాలవుతూ ఉంది. తొలి వన్డేని చేతులారా పోగొట్టుకున్న భారత్.. ఇప్పుడు రెండో వన్డే విషయంలో కూడా అదే సీన్ రిపీట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు అయితే మ్యాచ్ మీద ఎలాంటి గెలుపు అంచనాలు, ఆశలు లేకుండా ఆట కొనసాగిస్తోంది. బౌలింగ్‌లో ఎలా అయితే చేతులెత్తేశారో.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అదే సీన్ రిపీట్ అవుతూ వచ్చింది. ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాని గెలుపు తీరాలకు చేర్చాలనే ఆకాంక్షతో రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. అంటే కెప్టెన్ సాధారణంగా బ్యాటింగ్‌కి వస్తే ఇంతలా చెప్పుకోవాల్సిన పనిలేదు.
అయితే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో గాయం కారణంగా రోహిత్ శర్మ మైదానాన్ని వీడాడు. రెండో ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో హక్ ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ దానిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బాల్‌ని పట్టుకునే క్రమంలో అతనికి చేతికి గాయం అయ్యింది. నొప్పితో విలవిల్లాడుతూ రోహిత్ శర్మ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఇంక రోహిత్ శర్మ తిరిగి మ్యాచ్‌లోకి రాడని అంతా భావించారు. అయితే మ్యాచ్ పరిస్థితిని చూసిన తర్వాత రోహిత్ శర్మ మనసు మార్చుకున్నట్లుగా కనిపించింది. సిరీస్ విజయాన్ని నిర్దేశించే మ్యాచ్ కావడంతో రోహిత్ ఇలా బ్యాటింగ్ చేసేందుకు సాహసం చేశాడని భావిస్తున్నారు. ఇప్పుడు 8వ స్థానంలో బ్యాటింగ్‌కి దిగాడు. ఇప్పటివరకు 45 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేశారు. విజయం కోసం 29 బంతుల్లో 59 పరుగులు కావాల్సి ఉంది.
Captain Rohit Sharma came to bat with an injured thumb.
R E S P E C T 💗
📸: Sony Sports pic.twitter.com/sHHOu54Sn8
— CricTracker (@Cricketracker) December 7, 2022