క్యాష్ రిచ్ లీగ్ గా పేరొందిన ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లు కోట్లు గడిస్తున్న సంగతి తేలిందే. చిన్న దేశం.. పెద్ద దేశం అన్న తేడాలేకుండా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వంటి అన్ని దేశాల క్రికెటర్లు వారి వారి ఆటతీరుగా తగ్గట్టుగా కోట్లు కొల్లగొడుతున్నారు. ఇటీవల కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం అందుకు మరొక ఉదాహరణ. ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ సామ్ కరన్(రూ.18.50 కోట్లు) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇదిలావుంటే.. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వేతనాన్ని అందుకున్న ఆటగాళ్ల గణాంకాలు వెల్లడయ్యాయి. ఇందులో భారత ఆటగాడు, ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు.
మనీబాల్ నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గత 16 ఏళ్లలో ఐపీఎల్ ద్వారా మొత్తం 178.6 కోట్ల రూపాయలు ఆర్జించాడు. మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని తర్వాత స్థానంలో నిలిచాడు. ఇన్నేళ్లలో ధోనీ ఐపీఎల్ ద్వారా రూ.176.84 కోట్లు సంపాదించాడు. ఇక రోహిత్-ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ ద్వారా కోహ్లీ ఇప్పటివరకు రూ.173.2 కోట్లు సంపాదించాడు. ఇక సురేష్ రైనా, రవీంద్ర జడేజా, సునీల్ నరైన్ ఆటగాళ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
మొదటిసారి 2008లో ఐపీఎల్ వేలం జరిగినప్పుడు.. మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అప్పట్లో చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్లకు ధోనీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత ధోనీ ఆదాయం పెరుగుతూ వచ్చింది. 2020 ఐపీఎల్ సమయంలో 15 కోట్ల రూపాయలు అందుకున్నాడు. అయితే.. ధోనీ గత ఐపీఎల్ సీజన్‌లో ధోనీ తన వేతనాన్ని రూ.12 కోట్లకు తగ్గించుకున్నాడు. దీంతో అతను అగ్రస్థానాన్ని కోల్పోయాడు.
2008 ఐపీఎల్ వేలంలో అప్పటి డెక్కన్ ఛార్జర్స్, రోహిత్ శర్మను రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాతి 2 సీజన్‌లలో కూడా డెక్కన్ ఛార్జర్స్ తరుపున రోహిత్‌కు కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే అందింది. అనంతరం 2011లో రోహిత్ రూ.9.2 కోట్లకు ముంబై ఇండియన్స్‌తో జత కలిసాడు. దీంతో రోహిత్ ఆదాయం పెరుగుతూ వచ్చింది. 2014లో 12.5 కోట్లు, 2018లో 15 కోట్ల జీతం అందుకున్నాడు. తాజాగా, ఐపీఎల్ 2022 సీజన్ కోసం.. రోహిత్‌ను ముంబై ఇండియన్స్ రూ. 16 కోట్లకు అట్టిపెట్టుకుంది. దీంతో రోహిత్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.
1) రోహిత్ శర్మ – 178.6 కోట్లు
2) ఎంఎస్ ధోని – 176.84 కోట్లు
3) విరాట్ కోహ్లీ – 173.2 కోట్లు
4) సురేష్ రైనా – 110 కోట్లు
5) రవీంద్ర జడేజా – 109 కోట్లు
6) సునీల్ నరైన్ – 107.2 కోట్లు
7) ఎబి డివిలియర్స్ – 102.5 కోట్లు
8) గౌతమ్ గంభీర్ – 94.62 కోట్లు
9) శిఖర్ ధావన్ – 91.8 కోట్లు
10) దినేష్ కార్తీక్ – 86.92 కోట్లు
Highest earners in IPL history:
1) Rohit – 178.6 cr
2) Dhoni – 176.84 cr
3) Kohli – 173.2 cr
4) Raina – 110 cr
5) Jadeja – 109 cr
6) Narine – 107.2 cr
7) Devilliers – 102.5 cr
8) Gambhir – 94.62 cr
9) Dhawan – 91.8 cr
10) Karthik – 86.92 cr— Johns. (@CricCrazyJohns) December 29, 2022