టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 100వ టెస్టుకు భారీ క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గట్లే బీసీసీఐ కూడా స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించి, కోహ్లీకి మరింత ఉత్సాహాన్ని అందించేలా చేసింది. భారత్ రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్.. మంచి టచ్‌లో కనిపించాడు. అదే క్రమంలో 74 బంతుల్లో 45 పరుగులు చేశాడు. కానీ.. అనూహ్యంగా ఎంబుల్దేనియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. రెండో ఇన్నింగ్స్‌లోనైనా సెంచరీ చేస్తాడనే ఆశాభావంతో ఉన్నారు. అనంతరం టీమిండియా యువ క్రికెటర్లు పంత్, శ్రేయస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. తన సహజశైలి ఆటతీరుతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
విరాట్ కోహ్లీని అవుట్ చేసిన ఎంబుల్దేనియాను టార్గెట్‌గా చేసుకున్న పంత్ అతను వేసిన 76వ ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 0, 2 , 4తో విశ్వరూపం చూపించాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టి టీ20 క్రికెట్‌ను గుర్తు చేశాడు. కాగా ప్రతిష్టాత్మకమైన 100వ టెస్టులో కోహ్లీని అవుట్ చేసిన బౌలర్‌కు ఈ విధంగా చుక్కలు చూపించడంతో కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడిని అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేసి ఆనందాన్ని ఎంబల్దేనియాకు ఎక్కువ సేపు లేకుండా చేశాడు పంత్. యంగ్ గన్ పంత్ దెబ్బకు విరాట్‌ను అవుట్ చేసిన విషయాన్నే మర్చిపోయాడు ఎంబుల్దేనియా. ప్రస్తుతం పంత్ 93 బంతుల్లో 95 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరి పంత్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.