ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆసీస్ దూకుడు చూపిస్తుంది. మొదటి రెండు టెస్ట్‌లలో కంగారుల జట్టు విజయభేరి మోగించింది. అడిలైట్ టెస్ట్ ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్.. ఇంగ్లండ్ బౌలర్లను తప్పుబడుతూ.. ఓటమికి వారే కారణమనే విధంగా మాట్లాడాడు. రూట్ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ మండిపడ్డాడు. అసలు కెప్టెన్‌గా నువ్వేందుకు ఉన్నావంటూ నిలదీశాడు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమైన ఇంగ్లండ్ జట్టు అతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 275 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 473 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 230 పరుగులు చేసింది. అయితే ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు ఆలౌట్ చేయలేకపోయారు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేసింది. దీంతో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ మాట్లాడాడు. తమ బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పింక్-బాల్ టెస్ట్‌లో వికెట్లు తీయడానికి అవసరమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేకపోయారని మండిపడ్డాడు.
ఇదీ చదవండి: కప్పు బూడిద కోసం ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య క్రికెట్ యుద్ధం!
రూట్ వ్యాఖ్యలపై స్పందించిన ఆస్ట్రేలియా మజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇంగ్లండ్ కెప్టెన్‌పై విమర్శలు గుప్పించాడు. రూట్ వ్యాఖ్యలు విని ఆశ్యర్యానికి గురయ్యానని తెలిపాడు. బౌలర్లకు లైన్ అండ్ లెంగ్త్ గూరించి సలహాలు ఇవ్వాల్సింది రూటే కదా, వాళ్లు బౌలింగ్‌ను తీరును మార్చి ఎక్కడ బంతులు వేయాలో చెప్పాల్సింది కెప్టెనే కదా అని అన్నాడు. రూట్ అసలు కెప్టెన్‌గా మైదానంలో ఉండి ఏం చేస్తున్నాడని ప్రశ్నించాడు. కాగా ఐదు టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో ఓటమితో ఇంగ్లండ్ 0-2తో వెనుకడి ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26 నుంచి బాక్సిండ్ డే సందర్భంగా ప్రారంభం కానుంది. మరి ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ బౌలర్లపై చేసిన ఆరోపణలపై.. దానికి పాంటింగ్ ఇచ్చిన కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: క్రికెట్ చరిత్రలో కనీవిని ఎరుగని ఘటన! వైరల్ వీడియో