తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లీస్ట్ విడుదలైంది. ఈ లీస్టులో మన భారత ఆటగాళ్ల మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఆటగాళ్ల ఆటతీరుకు నిదర్శనంగా నిలిచే ఈ ర్యాంకింగ్స్ లో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకుందాం. ఇక తాజాగా విడుదల చేసిన లీస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు 916 పాయింట్లతో జో రూట్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇక తర్వాత స్థానంలో మాత్రం న్యూజీలాండ్ ఆటగాడు కేన్ విలిమ్సన్ 901 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక మన భారత ఆటగాళ్లు మాత్రం కాస్త వెనకంజలో కొనసాగుతుండటం విశేషం. కాగా భారత్ నుంచి మాత్రం కెప్టెన్ విరాట్ ను వెనక్కినెట్టాడు స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. 773 పాయంట్లతో కొనసాగుతూ 5వ స్థానానికి పరిమితమయ్యాడు. ఇక కోహ్లి 766 పాయింట్ల రాహిత్ ను దాటేయలేకపోయాడు. రోహిత్ శర్మ పిచ్ లతో సంబంధం లేకుండా తన దూకుడైన ఆటతీరుతో తన సత్తాను చాటుతూనే ఉన్నాడు. ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సైతం తన అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడనే చెప్పాలి.
Other changes in the @MRFWorldwide ICC Men’s Test Player Rankings for the week:
🔹 Rohit Sharma overtakes Virat Kohli
🔹 James Anderson enters top fiveDetails 👉 https://t.co/woGyneJVGk pic.twitter.com/9mFl314BS8
— ICC (@ICC) September 1, 2021