ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ని కైవసం చేసుకోవడానికి టీమిండియా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే.., ఫేస్ కి, స్వింగ్ కి కలిసొచ్చే ఇంగ్లాండ్ పిచ్ లు టీమిండియా బ్యాట్స్ మేన్స్ సత్తాకి పరీక్ష పెడుతున్నాయి. ఆండర్సన్ వంటి సీనియర్ బౌలర్ చెలరేగిపోతుండటంతో టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ సైతం చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఓపెనర్స్ కష్టాలు అయితే మాములుగా ఉండటం లేదు.
ఓవల్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్ట్ లో కూడా టీమ్ ఇండియాకి ఇలాంటి బ్యాడ్ స్టార్ట్ లభించింది. 39 పరుగులకే ఇండియా మొదటి మూడు వికెట్స్ కోల్పోయింది. అయితే.., ఫోర్త్ డౌన్ లో రహానేకి బదులుగా రవీంద్ర జడేజా బ్యాటింగ్ కి వచ్చాడు. దీంతో.., లోయర్ ఆర్డర్ లో ఆడాల్సిన జడ్డు.., ముందే క్రీజ్ లోకి వచ్చాడో తెలియక ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. అయితే.. ఇదంతా కోహ్లీ గేమ్ ప్లాన్ గా తెలుస్తోంది.
ఇంగ్లాండ్ టూర్ లో పుజారా, కోహ్లీ, రహానే, పంత్ అంత గొప్పగా రాణించడం లేదు. దీనికి కారణం.. ఓపెనర్స్! ఇండియాకి ఈ సీరిస్ లో ఫస్ట్ టెస్ట్ లో మినహా.., మిగతా ఇన్నింగ్స్ లలో మొదటి వికెట్ కి మంచి భాగ్యస్వామ్యం లభించ లేదు. దీంతో.. బాల్ పాత పడకముందే.. ఫామ్ లో లేని కోహ్లీ, పుజారా, రహానే, పంత్ క్రీజ్ లోకి రావాల్సి వస్తోంది. దీని కారణంగా వీరు కూడా అనవసరంగా వికెట్స్ కోల్పోతున్నారు. కానీ.., జడేజా పరిస్థితి ఇలా కాదు.
జడ్డు ప్రతి ఇన్నింగ్స్ లో సెకండ్ న్యూ బాల్ ని ఫేస్ చేసి రన్స్ సాధిస్తున్నాడు. పైగా.. ఫామ్ లో కూడా ఉన్నాడు. ఒకవేళ జడేజా గనుక బాల్ పాత పడే వరకు క్రీజ్ లో ఉంటే.. తరువాత వచ్చే రహానే, పంత్ పని సులువు అవుతుందన్నది కోహ్లీ ప్లాన్. ఇందుకే ఎప్పుడూ లేని విధంగా రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకి వచ్చినట్టు తెలుస్తోంది. మరి.. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.