వరల్డ్ క్రికెట్ లో బ్యాటర్లను వణికించిన బౌలర్లు ఉన్నారు.. బౌలర్లను ఊచకోత కోసిన బ్యాటర్లు ఉన్నారు.. అయితే ప్రపంచ అత్యుత్తమ బౌలర్లును ఎదుర్కొన్న ఆ దక్షిణాఫ్రికా బ్యాటర్ కు మాత్రం.. ఆ టీమిండియా బౌలర్ అంటే వణుకు అని, అతడి బౌలింగ్ ను ఆడలేక ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపా అని స్వయానా ఆ స్టార్ బ్యాట్స్ మెనే చెప్పడం విశేషం. ఆ బ్యాటర్ ఎవరో కాదు నిలకడైన బ్యాటర్ గా పేరుగాంచిన ఫాఫ్ డు ప్లెసిస్. అండర్సన్, ఆర్చర్, స్టార్క్ లాంటి హేమాహేమీల బౌలింగ్ ను ఎదుర్కొన్న నాకు.. అతడి బౌలింగ్ ఎదుర్కొవడం చాలా కష్టమైందని డు ప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
డు ప్లెసిస్.. సౌతాఫ్రికా క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. నిలకడైన బ్యాటింగ్ తో పాటుగా అటు కెప్టెన్ గా దక్షిణాఫ్రికాకు ఎన్నో చిరస్మరణియమైన విజయాలను అందించాడు. ప్రస్తుతం కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత టీ20 లీగ్ లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు డు ప్లెసిస్. ఈ క్రమంలోనే ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన క్రికెట్ కెరీర్ కు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు.
ఈ సందర్భంగా తన టెస్ట్ కెరీర్ లో తాను ఎదుర్కొన్న అత్యంత స్ట్రాంగెస్ట్ బౌలర్ గురించి చెప్పుకొచ్చాడు. టెస్టుల్లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఆడాలి అంటే నాకు వణుకు పుట్టేదని డు ప్లెసిస్ అన్నాడు. అదీకాక అతడి బౌలింగ్ ఆడలేక నాకు నిద్ర కూడా పట్టేదికాదని, జడేజా వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అని వెల్లడించాడు. నా కెరీర్ లో ఎంతో మంది బౌలర్లను ఎదుర్కొన్నాను, కానీ జడేజా ప్రత్యేకం అని డు ప్లెసిస్ చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరు గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కలిసి ఆడిన సంగతి మనందరికి తెలిసిందే. ఇక జడేజా మోకాలి గాయంతో ఆసియా కప్ తో సహా.. టీ20 వరల్డ్ కప్ కు కూడా దూరం అయిన సంగతి మనందరికి తెలిసిందే. మరి రవీంద్ర జడేజాపై డు ప్లెసిస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.