శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోర్ సాధించింది. 8 వికెట్లు కోల్పోయి 574 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీతో భారత్ ఈ స్కోర్ సాధించగలిగింది. 228 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో జడేజా 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయకుంటే జడేజా కచ్చితంగా డబుల్ సెంచరీ బాదేవాడు. ఇదే విషయంలో కొంతమంది ఫ్యాన్స్ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌శర్మపై మండిపడ్డారు.
కొద్ది సేపు ఉంటే.. జడేజా తన తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసుకునేవాడు. కేవలం 25 పరుగుల తేడాతో జడేజాను డబుల్ సెంచరీకి దూరం చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. కాగా ఇదే విషయమై స్పందించిన జడేజా.. తానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయమని చెప్పానని భారీ బాంబు పేల్చాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన జడేజా చాలా సేపు క్రీజ్‌లో ఉండడంతో లంక ప్లేయర్ల కదలికలను గమనిస్తున్నాడు. భారత్ 574 పరుగుల వద్దకు చేరుకునే సరికే వాళ్ల చాలా అలసిపోయారని, అందుకే వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తే వికెట్లు తీసుకునే అవకాశం ఉంటుందని భావించి.. తానే డ్రెస్సింగ్ రూమ్‌కు ఇన్నింగ్స్ డిక్లేర్ కోసం ప్రతిపాదించినట్లు జడేజా వెల్లడించాడు. దీంతో ఇన్నింగ్స్ డిక్లేర్ వెనుక ద్రవిడ్, రోహిత్ హస్తం లేదనే విషయం స్పష్టమైంది.
జడేజా ఊహించినట్లే శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో త్వరగానే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. రెండు రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన లంకేయులు 108 పరుగులు చేసి 4 కీలక వికెట్లు కోల్పోయింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
That will be STUMPS on Day 2 of the 1st Test.
Sri Lanka 108/4, trail #TeamIndia 574/8d by 466 runs.
Scorecard – https://t.co/c2vTOXSGfx #INDvSL @Paytm pic.twitter.com/LqUs9xCxtc
— BCCI (@BCCI) March 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.