2023 వరల్డ్ కప్ నెగ్గడమే ధ్యేయంగా కొత్త సంవత్సరం బరిలోకి దిగిన టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే గతేడాది బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లల్లో ఘన విజయం సాధించిన టీమిండియా అదే జోరును శ్రీలంకపై మీద కూడా చూపించింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించిన భారత్ సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం జరగుతున్న టీ20 సిరీలో 1-1తో సమంగా నిలిచాయి భారత్-న్యూజిలాండ్ జట్లు. దాంతో నిర్ణయాత్మకమైన మూడో టీ20లో గెలిచి సిరీస్ ను 2-1తో కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి ఇరు జట్లు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన మూడో టీ20లో తన పవర్ హిట్టింగ్ చూపించాడు టీమిండియా యంగ్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి. సూర్య, ABD లను మించేలా సిక్స్ కొట్టాడు.
ABD, సూర్య కుమార్.. క్రికెట్ లో 360 డిగ్రీల ప్లేయర్స్ గా పేరొందిన ఆటగాళ్లు. వీరిద్దరు గ్రౌండ్ కు నలువైపులా సిక్స్ లు బాదగల వీరులు. వీరి ముందు ఎలాంటి బౌలర్ అయిన తల దించాల్సిందే. తాజాగా కివీస్ తో జరుగుతున్న మూడో టీ20లో వీరిద్దరిని మించేలా సిక్స్ కొట్టాడు యంగ్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి. కివీస్ బౌలర్ పెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ లో పవర్ హిట్టింగ్ తో సూర్య, ఏబీడి లనే మరిపించాడు. పెర్గూసన్ వేసిన ఈ ఓవర్ లో ఇన్నింగ్స్ 5.3 బాల్ ను సూర్య స్టైల్లో ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టాడు త్రిపాఠి. ఇది ఇన్నింగ్స్ కే హైలెట్ అని చెప్పాలి. 148 కి.మీ స్పీడ్ వచ్చిన బాల్ ను త్రిపాఠి సిక్సర్ గా మలిచిన తీరు అందరిని ఆకట్టుకుంది. 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు త్రిపాఠి. ప్రస్తుతం త్రిపాఠి సిక్సర్ కొట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి సూర్య, ఏబీడీని తలపించేలా త్రిపాఠి కొట్టిన సిక్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
148 kmph by Ferguson and Rahul Tripathi played a crazy shot. pic.twitter.com/o1dNVkDwAz
— Johns. (@CricCrazyJohns) February 1, 2023