టీమిండియా హెడ్ కోచ్ నియామకానికి రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బీసీసీఐ కూడా ద్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఓ బీసీసీఐ అధికారి కూడా స్పందించినట్లు తెలుస్తోంది. అవును.. ద్రావిడ్ బీసీసీఐ హెడ్ కోచ్ నియామకానికి దరఖాస్తు చేసుకున్నాడని తెలిపారట.
అయితే ద్రావిడ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీకి హెడ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక మరో విషయం ఏంటంటే..? ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి కొనసాగుతున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అనంతరం అతని పదవి ముగియనుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు చేసుకున్నారట. దీంతో ఖచ్చితంగా టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నియామకం అవుతారని కొందరు అభిప్రాయపడుతున్నారు.