క్రీడా రంగంలో విషాదం నెలకొంది. ICC మాజీ అంపైర్ పాకిస్థాన్ కు చెందిన అసద్ రౌఫ్(66) గుండెపోటుతో గురువారం(సెప్టెంబర్ 15)న హఠాన్మరణం చెందాడు. ఈ విషయాన్ని అతని సోదరుడు తాహీర్ మీడియాకు వెల్లడించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ క్రీడాభిమానులకు అంపైర్ గా అసద్ రౌఫ్ సుపరిచితుడు. పాకిస్థాన్ అలనాటి అంపైర్ అలీం దార్ తర్వాత మళ్లీ అంతటి పేరు సంపాదించిన అంపైర్లలో అసద్ ఒకరు. 66 సంవత్సరాల అసద్ 170కి పైగా అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైర్ గా వ్యవహరించాడు. అతడి మరణవార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అసద్ రౌఫ్.. అంపైరింగ్ నుంచి తప్పుకున్నాక.. లాహోర్ లోని లాండా బజార్ లో ఓ బట్టల దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం యదావిధిగా తన షాప్ ను మూసివేసి ఇంటికి బయలుదేరాడు. అప్పటి నుంచే అతడి ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు అతడి సోదరుడు తాహిర్ వెల్లడించాడు. ఇంటికి రాగానే ఒక్కసారిగా కుప్పకూలడంతో అతడిని దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే అసద్ గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అసద్ తన కెరీర్ లో 170కి పైగా మ్యాచ్ లకు రిఫరీగా చేశారు. అందులో 64 టెస్ట్ లు, 139 వన్డేలు, 28 టీ20లు సైతం ఉన్నాయి. అదికాక IPLలో సైతం తన సేవలను అందించాడు. 2013 IPLలో అసద్ పై ఫిక్స్ంగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని BCCI నిషేధించింది. ఆ తర్వాత అతడు మళ్లీ అంపైరింగ్ చేసేందుకు అంత ఆసక్తి చూపించ లేదు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. మరి అతడి హఠాన్మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
Former Pakistan umpire #AsadRauf passed away. #RIP pic.twitter.com/73Hkkszct8
— Devendra Pandey (@pdevendra) September 15, 2022