భారత్, పాకిస్తాన్ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు. దీనికి ఆద్యం పోసింది మాత్రం.. ఆయా దేశాల క్రికెట్ బోర్డులే అని చెప్పాలి. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న పొట్టి ప్రపంచకప్ కోసం ఇప్పటికే జట్లను ప్రకటించిన ఇరుదేశాల బోర్డులు.. తాజాగా, ఆ ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీలను విడుదల చేశాయి. ఈ తరుణంలో ఇరుదేశాల క్రీడా అభిమానులు తమ నోటికి పనిచెప్పారు. కొత్త జెర్సీలపై.. మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆ వివరాలు..
‘భారత్, పాకిస్తాన్..’ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఎలా ఉంటదో మనందరకి తెలుసు. అందుకు కారణం.. ఇరుదేశాల సరిహద్దు వివాదాలే. ఇరు జట్లు తలపడితే.. ‘మేం గెలవాలంటే.. మేం గెలవాలని ఇరుదేశాల ప్రజలు పూజలు, ప్రార్థనలు చేయడం’ సదా మాములే. ఈ ఇరుదేశాల ఎప్పుడు కలుస్తాయా? అని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తుంటే.. అభిమానులు, ప్రజలు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఏ చిన్న విషయం జరిగినా.. ఒకరినినొకరు సమర్ధించుకోవడం పోయి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా, అలాంటి పోరు మరోసారి మొదలయింది. టీ20 ప్రపంచ కప్ జెర్సీలు.. మీది బాగోలేదంటే.. మీదీ బాగోలేదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కామెంట్లకు కూడా ‘మసాలా’ జోడిస్తున్నారు.
New series 👍
New threads 💙
Renewed energies 👏#TeamIndia | #INDvAUS pic.twitter.com/H9fyYCRwe4— BCCI (@BCCI) September 19, 2022
𝐓𝐡𝐞 𝐛𝐢𝐠 𝐫𝐞𝐯𝐞𝐚𝐥!
Presenting the official Pakistan T20I Thunder Jersey’22 ⚡
Order the official 🇵🇰 shirt now at https://t.co/A91XbZsSbJ#GreenThunder pic.twitter.com/BX5bdspqt1
— Pakistan Cricket (@TheRealPCB) September 19, 2022
టీమిండియా కొత్త జెర్సీపై ట్రోలింగ్ కు దిగిన పాకిస్తాన్ అభిమానుల గూబ గుయిమనిపిస్తున్నారు నెటిజన్లు. టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ జట్టు ధరించబోయే జెర్సీయే అందుకు నిదర్శనం. పీసీబీ తాజాగా విడుదల చేసిన ‘థండర్ జెర్సీ’పై భారత్ లో కాదు.. ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ట్రోలింగ్ కు దిగుతున్నారు. కొత్త జెర్సీని పుచ్చకాయతో పోలుస్తూ ఎగతాళి చేస్తున్నారు. పుచ్చకాయకు పాకిస్తాన్ జెర్సీకి తేడా ఏమీ లేదంటూ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదుతున్నారు.
Netizens Proclaim New Pakistan’s T20 World Cup “Thunder” Jersey “Water Melon Themed”#T20WorldCup pic.twitter.com/qFTp1nviSJ
— Ayesha Rajpoot (@RajpootAyesha11) September 19, 2022
ఈ జెర్సీ రెగ్యులర్ గా ధరించే ‘ఆకుపచ్చ’ రంగులో ఉండి దాని మీద చారలతో కూడిన లైన్లు వచ్చాయి. ఇది చూడటానికి అచ్చం పుచ్చకాయ మాదిరే ఉంది అని ఒక యూజర్ కామెంట్స్ చేశాడు. ఇదే జెర్సీ వైట్ కలర్ లో ఉండి ఉంటే.. మీ ఆటగాళ్లు జీబ్రాలా! కనిపించేవారంటూ మరో యూజర్ పేర్కొన్నాడు.
Pakistan fans trolling Indian jersey..
~Meanwhile Pakistan jersey.. pic.twitter.com/4wGc3vDiK3
— รѵҡ ∂αเℓεε✨ (@GrimRea27782254) September 18, 2022
పాకిస్తాన్ జెర్సీకి సంబంధించిన వీడియో పీసీబీ ట్విటర్ లో పోస్ట్ చేయకముందే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీంతో నెటిజన్లు పీసీబీని ఓ ఆటాడుకుంటున్నారు. ‘పాకిస్తాన్ లో పెరుగుతున్న కూరగాయలకు ఈ జెర్సీ అంకితం..’, ‘ఇదేంటి జెర్సీ అని చెప్పి పుచ్చకాయలను తొడుక్కున్నారు..’, ‘ఓన్లీ పుచ్చకాయలేనా..? ఇంకేమైనా కూరగాయలు గట్రా పెట్టారా..?’ అంటూ పాక్ అభిమానులనులను ఏకిపారేస్తున్నారు. మొత్తానికి ఇరు దేశాల అభిమానులతో ట్విట్టర్ లో వార్ హోరెత్తితోంది. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pakistan cricket jersey on sale 100 percent discount pic.twitter.com/mortlR21HY
— Ctrl C Ctrl Memes 45 (@Ctrlmemes_) September 19, 2022