మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వైవిధ్యమైన ఆటగాడు. అతడు వేసే ఎత్తులకు.. ఎంతటి ఆటగాడైనా తలవంచాల్సిందే. ఇక ఓడిపోతుంది అనుకున్న ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించిన ఘనుడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో రికార్డులు అతని సొంతం. టీమిండియాకు 3 ICC ట్రోఫీలు అందించిన ఘనత ధోనిదే కావడం విశేషం. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 ప్రపంచ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీలను భారతదేశం ఖాతాలో వేశాడు మిస్టర్ కూల్ ధోని. ఇన్ని రికార్డులు సాధించిన ధోని చదువులో మాత్రం మెరిట్ స్టూడెండ్ ని కాదని ఒప్పుకున్నాడు. తాజాగా కర్ణాటకలో “MS ధోని గ్లోబల్ స్కూల్” ని ప్రారంభించిన సందర్భంగా పిల్లలతో చిట్ చాట్ చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ధోని.. గ్రౌండ్ లో ఎంత ప్రశాంతంగా ఉంటాడో.. బయట అంత ఉత్సాహాంగా ఉంటాడు. ఈ క్రమంలోనే తన పేరు మీద ఓ స్కూల్ ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా పిల్లలు అడిని పలు ప్రశ్నలకు చాలా సరదాగా సమాధానాలు చెప్పాడు. ఇక తన చదువు గురించి మాట్లాడుతూ..”మీ అందరిని ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నా చదువు విషయానికి వస్తే.. నేనేమి మెరిట్ స్టూడెంట్ ని కాదు. దాంతో మా నాన్న నన్ను 10 th కూడా పాస్ కావురా నువ్వు అని తిట్టేవాడు. ఆయన అన్నట్లే జరుగుతుంది అనుకున్నా కానీ నేను బోర్డు ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యాను. దాంతో మా నాన్న సంతోషించారు. ఇక నేను ఎప్పుడూ ఆటల్లో మునిగి ఉండటంతో నా హాజరు శాతం చాలా తక్కువగా ఉండేది. అదీ కాక పదవ తరగతి వరకు నేను యావరేజ్ స్టూడెంట్ నే” అంటూ వివరించాడు.
ఈ క్రమంలోనే పిల్లలు మీ ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? అని అడగ్గా..”ఆ సబ్జెక్ట్ లల్లో ఆటలు అనే సబ్జెక్ట్ ఉందా? అంటూ చమత్కారంగా అడిగాడు. దాంతో అక్కడ అంతటా నవ్వులు పూశాయి. ఇక ధోని తనకు వచ్చిన మార్కుల గురించి తెలుపుతూ.. పదవ తరగతిలో నాకు 66 శాతం మార్కులు వస్తే.. ఇంటర్ లో 56 లేదా 57 శాతం వచ్చాయి. సరిగ్గా గుర్తులేదు అంటూ నవ్వులు చిందించాడు. ఈ నేపథ్యంలోనే ధోని తన రిటైర్మెంట్ తర్వాత పలు బిజినెస్ లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా సినిరంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఎంఎస్ ధోని ఎంటర్టైన్ మెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాడు. అయితే చదువుల్లో ధోని ఒక్కడే యావరేజ్ స్టూడెంట్ కాదు. చాలా మంది ఇండియన్ క్రికెటర్లు పెద్ద పెద్ద చదువులు ఏమీ చదవలేదన్న సంగతి చాలా మందికి తెలిసిన విషయమే.
MS Dhoni inaugurated the “MS Dhoni Global School”. This is really great initiative and thing from MS Dhoni for young talents. pic.twitter.com/oJtxq1rDof
— CricketMAN2 (@ImTanujSingh) October 10, 2022
Former Indian skipper MS Dhoni shared a unique experience from his school days.#MSDhoni https://t.co/s4kGktQY3d
— CricTracker (@Cricketracker) October 11, 2022