ఇండియన్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో అగ్రగణ్యుడు, భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన మహేంద్రసింగ్ ధోని రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్టెప్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన ధోని.. ఐపీఎల్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2021లో టీమిండియాకు మెంటర్‌గా వ్యవహరించినా ఆశించిన ఫలితం రాలేదు. ఒకవైపు ఐపీఎల్ ఆడుతూనే.. మరోవైపు ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ధోని.. దాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ‘ధోని ఎంటర్మైంట్స్’ ప్రొడక్షన్ కంపెనీలో ఇక నుంచి తెలుగు, తమిళ్, మలయాళంలో భారీ సినిమాలు నిర్మించనున్నాడు ధోని.
ధోనితో పాటు అతని భార్య సాక్షి కూడా ఈ ‘ధోని ఎంటర్మైంట్స్’లో సహ భాగస్వామి. ఇప్పటికే హిందీలో ఈ ప్రొడక్షన్ కంపెనీలో మూడు చిన్నసినిమాలను నిర్మించారు. ‘రోర్ ఆఫ్ ది లయన్’,‘బ్లెజ్ టూ గ్లోరీ’, ‘హిడెన్ హిందూ’ వంటి సినిమాలను ధోని ఎంటర్మైంట్స్ బ్యాటర్‌లో నిర్మించారు. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సమయంలో వారి రీ ఎంట్రీపై రోర్ ఆఫ్ ది లయన్ మూవీని, టీమిండియా 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించిన మధురక్షణాలపై బ్లెజ్ టూ గ్లోరీ అనే డాక్యుమెంట్రీని తీశారు. ఒక మైథలాజికల్ థ్రిల్లర్‌గా హిడెన్ హిందీని నిర్మించారు. ఇప్పుడు తన ప్రొడక్షన్ కంపెనీని మరింత విస్తరించే పనిలో భాగంగా సౌత్ ఇండియాలోని మూడు భాషల్లో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమతున్నారు.
తెలుగు, తమిళ్‌తో పాటు మళయాలంలోనూ ధోని ఎంటర్మైంట్స్ ప్రొడక్షన్ కంపెనీలో సినిమాలు నిర్మించనున్నారు. ఇప్పటికే దేశం గర్వించదగ్గ ఆటగాడిగా ఉన్న ధోని.. పెద్ద నిర్మాతగా గొప్ప గొప్ప సినిమాలు తీయాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి తెలుగులో మొదటి సినిమాను ఏ దర్శకుడితో, ఏ హీరోతో నిర్మించబోతున్నారంటూ ఇప్పటికే ఫిల్మ్‌నగర్‌తో పాటు అభిమానుల్లోనూ ఆసక్తి మొదలైంది. కాగా.. ఒకే సినిమాను ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తారా? లేక ఆయా భాషల్లోనే పరిమితం అవుతారా అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.
#LetsCinema EXCLUSIVE: Dhoni is launching his film production company in south ‘Dhoni Entertainment’ to produce films in Tamil, Telugu and Malayalam. pic.twitter.com/zgTxzdSynT
— LetsCinema (@letscinema) October 9, 2022