‘కెప్టెన్..‘ సామర్ధ్యం అనేది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలోనే ఉంటుంది. టీమిండియా సారధిగా మహేంద్ర సింగ్ ధోనీ అదే చేశాడు. సక్సెస్ అయ్యాడు. దేశానికి.. టీ20 వలర్డ్ కప్ 2007, వన్డే వలర్డ్ కప్ 2011తో పాటు ఛాంపియన్స్ లీగ్ 2011ను సాధించిపెట్టాడు. ఇలా ధోనీ సాధించిన విజయాల గురుంచి మనకు తెలుసు. అయితే.. ‘ధోనీని కాకుండా గంభీర్ ని కెప్టెన్ ని సారధిగా నియమించుంటే ఇంతకంటే మంచి విజయాలు సాధించేవాడంటూ..’ గంభీర్ అభిమానులు నోటికి పనిచెప్తున్నారు. సమయం, సందర్భం లేకుండా వీళ్లు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు గంభీర్ తన కెరీర్ లో సాధించిన విజయాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..
ఇటీవల ముగిసిన లెజెండ్స్ లీగ్ టోర్నీలో గంభీర్ సారధ్యంలోని ‘ఇండియా క్యాపిటల్స్’ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో ఇర్ఫాన్ పఠాన్ సారధ్యంలోని భిల్వారా కింగ్స్ ను గంభీర్ సేన 104 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయాన్ని సాకుగా చూపుతున్న గంభీర్ అభిమానులు.. ధోనీ సాధించిన విజయాలన్నింటినీ బయటకు లాగుతున్నారు. ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిపించి ఉండొచ్చేమో కానీ, ఆ మ్యాచులలో కూడా మా గంభీర్ రాణిస్తేనే ఆ విజయాలొచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. గంభీర్ సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ.. ధోనీ ఫ్యాన్స్ కు సవాల్ విసురుతున్నారు.
India Won the inaugural T20 world cup under MS Dhoni’s Captaincy.
& Dhoni becomes –
1 . 1st captian to win T20WC
2 . Only Indian Captain to win T20WC
3 . 2nd captain to defeat pakistan in Finals of ICC tournaments. pic.twitter.com/6ePp1zGNF7— Govardhan Reddy (@gova3555) October 7, 2022
గంభీర్ తన కెరీర్ లో మొదటిసారి 2010లో జాతీయజట్టు పగ్గాలు చేపట్టాడు. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఆ వన్డే సిరీస్ ను గంభీర్ సేన 5-0 తేడాతో గెలుచుకుంటుంది. అంతేకాదు.. ఆ సిరీస్ లో గంభీర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకుంటాడు. ఆపై.. ఐపీఎల్ లో కోలకతా నైట్ రైడర్స్ కు సారధ్యం వహించిన గంభీర్, 2012, 2014లలో జట్టును విజేతగా నిలిపాడు. ఆ క్రమంలో ఎన్నో మ్యాచుల్లో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఇక, ఇటీవల ముగిసిన లెజెండ్స్ లీగ్ టోర్నీలో గంభీర్ సారధ్యంలోని ‘ఇండియా క్యాపిటల్స్’ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Gautam Gambhir Wins As A Captain.. pic.twitter.com/T27dMArOdU
— Govardhan Reddy (@gova3555) October 7, 2022
కాగా, ధోనీ సారధ్యంలో భారత జట్టు విజేతగా నిలిచిన రెండు వరల్డ్ కప్ లలోనూ గంభీర్ రాణించడం గమనార్హం. 2007 టీ20 వలర్డ్ కప్ ఫైనల్ పోరులో 75 పరుగులు(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు) చేసిన గంభీర్, 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోరులో 97 పరుగుల(122 బంతుల్లో, 9 ఫోర్లు)తో రాణిస్తాడు. ఇలా కీలక ఇన్నింగ్స్ లు ఆడినప్పటికీ తనకు గుర్తింపు రాకపోగా.. దాన్ని ధోనీ ఖాతాలో వేసుకోవడమే గంభీర్ కు నచ్చలేదు. ఈ విషయంపై ఇప్పటికే.. గంభీర్ ఎన్నోసార్లు పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశాడు. విమర్శకుల తీరు ఇలా ఉన్నప్పటికీ.. తన నాయకత్వ లక్షణాలు, తీసుకున్న నిర్ణయాల కారణంగా ‘కెప్టెన్ కూల్’ ఎప్పుడూ గంభీర్ కంటే ముందువరుసలోనే ఉంటాడు.
It’s been 15 years since the iconic victory Vs Pakistan at the 2007 T20 World Cup Final. A young team led by MS Dhoni did magic. Gambhir played a brilliant knock, the trophy journey for MS started from there.
One of the most memorable day for Indian fans! pic.twitter.com/4XXt51igi2
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 23, 2022